ప్రభాస్ – ప్రశాంత్ కొత్త చిత్రం .. ‘సలార్’ గా రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ … ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాత భారీ చిత్రాల్లోనే నటిస్తున్న ప్రభాస్ ఇప్పటికే పలు చిత్రాలను లైన్ ‌లో పెట్టేశాడు.

కేజిఎఫ్ వంటి భారీ హిట్ మూవీని రూపొందించిన ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్టు చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సలార్’ .. ద మోస్ట్ వైలెంట్ మ్యాన్.. కాల్‌డ్ వన్ మ్యాన్.. ద మోస్ట్ వన్ మ్యాన్ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించనున్నారు.

తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌ లో ప్రభాస్ కోర మీసంతో వైలెంట్ ‌గా కనిపిస్తున్నాడు.అలాగే, ఇందులో ఓ పెద్ద గన్‌ను కూడా పట్టుకుని రాయల్‌ గా కనిపిస్తున్నాడు.దీనితో ఈ పోస్టర్‌కు భారీ స్థాయిలో ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాను ఓ మాఫియా డాన్ కథతో రూపొందించబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ అతి క్రూరుడిగా కనిపించచనున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా ఎనౌన్స్ చేసింది నిర్మాణ సంస్థ. ఈ పోస్టర్ చూసిన రెబెల్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

ఇకపోతే , ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా 2021 లో విడుదల కానుంది. దీని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించే ‘ఆదిపురుష్’లో నటించనున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమాలో నటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ చిత్రం ‘సలార్’ గానీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.