రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పాన్ ఇండియా కేటగిరిలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడుతు న్నాయి. సుదీర్ఘ కాలం వెచ్చించి స్ర్ర్కిప్ట్ సిద్దం చేసాడు. ఇది సోషియా ఫాంటసీ స్ర్కిప్ట్ అని ఇప్పటికే లీకులందుతున్నాయి. తక్కువ టైమ్ లోనే బెస్ట్ టెక్నీషియన్ గా నిరూపించుకున్న యంగ్ డైరెక్టర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ని డైరెక్ట్ చేయడంతో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా సీనియిర్ నిర్మాత అశ్వీనిదత్ కుమార్తెలతో కలిసి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. లాక్ డౌన్ కూడా కలిసి రావడంతో యంగ్ డైరెక్టర్ స్ర్కిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నాడు. తాజాగా ఈ సినిమా వివరాలతో పాటు, ప్రభాస్ కి సంబంధించిన వివరాలను దత్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. తొలుత ప్రభాస్‌ను హీరోగా దత్ లాంచ్ చేసే అవకాశం తమకే వచ్చిందిట. కానీ అనివార్య కారణాల వల్ల జరగలేదన్నారు. తర్వాత వేర్వేరు పనుల్లో పబిపోవడం వల్ల కుదరలేదుట. అయితే ప్రభాస్ నటించిన బాహుబలి చూసిన తరువాత ఎలాగైనా అతనితో ఓ సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నారుట. ఇదే విషయాన్ని ప్రభాస్ కి వివరించగా వెంటనే తన సినిమాకు ఒప్పుకున్నట్లు తెలిపారు.
ఈ స్ర్కి్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించే స్క్రిప్ట్ అవుతున్నందకు సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారుట. అక్టోబర్‌లో సినిమా ప్రారంభమవుతుంది. 2022 ఏప్రిల్ లో చిత్రాన్ని విడుదల చేస్తామని దత్ తెలిపారు. అంటే దత్ గారికి దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చిందన్న మాట. పరిశ్రమలో ఎప్పుడు ఏం జరగుతుందో తెలియదు. ఓడలు బళ్లు అవుతాయి..బళ్లు ఓడలవుతాయి. వెనుకొచ్చిన వారు ముందునుంటారు. ముందున్న వారు వెనక్కి వస్తారు. సినిమా వరల్డ్ ఎటు నుంచి ఎటుకైనా టర్న్ తిప్పగలదు.