ప్రభాస్ శత్రువు హృతిక్.. అంతేగా!
డార్లింగ్ ప్రభాస్ ధూమ్ 4లో నటిస్తున్నారా? అంటే అవుననే టాలీవుడ్ లో చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే తొలి హిందీ చిత్రం ఇదే అవుతుందని అంతా భావిస్తున్నారు. ఆ మేరకు ఇప్పటికీ యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ప్రభాస్ తో టచ్ లోనే ఉందని ఇప్పటికీ మంతనాలు సాగిస్తోందని తాజాగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. రాధాకృష్ణతో ప్రభాస్ 20 చిత్రీకరణ పూర్తవుతోంది. అటుపై నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తాడు. అది ప్రభాస్ పాన్ ఇండియా రేంజును మరింత ముందుకు తీసుకెళుతుంది. అప్పటికి ధూమ్ 4కి ప్రభాస్ కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుందట. ఈ మూవీలో హృతిక్ రోషన్ కీలక పాత్ర పోషించనున్నాడు. అతడితో పోటీపడే పాత్రలో ప్రభాస్ నటించే వీలుంది. లేదూ నాగ్ అశ్విన్ సినిమాతో పాటే యశ్ రాజ్ బ్యానర్ కి కాల్షీట్లు కేటాయిస్తాడా? అన్నదానిపైనా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. యశ్ రాజ్ బ్యానర్ తో పాటు గా ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కి కూడా ప్రభాస్ వేరొక సినిమా చేసే అవకాశం ఉందన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
నిజానికి షారూక్ .. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లను ఎంపిక చేయాలని యశ్ రాజ్ సంస్థ ఎంతో ట్రై చేసింది. కానీ ఆ ఇద్దరూ ధూమ్ 4లో నటించేందుకు సుముఖంగా లేరు. పైగా ఆ ఇద్దరూ సొంత ఫ్రాంఛైజీ సినిమాలకు సన్నాహకాల్లో ఉండడం వల్ల కూడా అది సాధ్యపడలేదు. ఆ క్రమంలోనే ప్రభాస్ ని జాక్ పాట్ వరించిందని చెబుతున్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా అవతరించే అవకాశం ఉంటుందని కూడా అభిమానులు అంచనా వేస్తున్నారు.