షాకింగ్ : దారుణంగా దర్శకుడు మారుతీ పరువు తీస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.!

ఎక్కడైనా ఓ హీరో నుంచి కొత్త సినిమా వస్తుంది అంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా దానికోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తారు కానీ మన తెలుగులో మాత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఊహించని లెవెల్లో షాకిస్తున్నారు.

ఇప్పటికే రెండు సినిమాలు “రాధే శ్యామ్”, “సాహో” లతో భారీగా దెబ్బ తిని ఉన్న వీరు ప్రభాస్ నుంచి హిట్ సినిమా కోరుకుంటున్నారు. దీనితో పలు సినిమాలపై బాగానే ఉన్నా ప్రభాస్ నటించనున్న ఓ సినిమాకి మాత్రం అసలు స్టార్ట్ అవ్వకముందే దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఆ సినిమా దర్శకుణ్ణి అవమాన పరిచేలా చేస్తున్నారు.

ఇది ఎంత వరకు మంచి స్టెప్ అనే విషయం వారు ఆలోచించారో లేదో కానీ దర్శకుడు మారుతీ విషయంలో వారు చేస్తుంది చాలా తప్పని చెప్పక తప్పదు. ప్రభాస్ మారుతితో సినిమా చేయాలనీ  ఈరోజే ముహూర్తం కూడా కానీ సీట్ కట్ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఇండియన్ వైడ్ గా టాలీవుడ్ నుంచి బాయ్ కాట్ మారుతీ అంటూ షాకింగ్ నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు.

అసలు మారుతీ ప్రభాస్ తో ఏ లెవెల్లో ప్లాన్ చేసాడో కూడా వారికి ఐడియా లేదు కానీ ఇంత దారుణంగా అది కూడా ఇండియన్ వైడ్ ట్రెండ్ అయ్యే విధంగా అవమానించడం అనేది దారుణం అనే చెప్పాలి. ఒకవేళ ఇది మారుతీ వరకు వెళితే తాను చాలా హర్ట్ అయ్యినా అవుతాడు.