A – ఆదిపురుష్ : రాముడిగా ప్రభాస్ మహాద్భుతమైన ఫోటో వచ్చేసింది .. చేతులెత్తి దండం పెట్టాల్సిందే

A-ఆదిపురుష్.. రామాయణ ఇతిహాసాన్ని బేస్ చేసుకొని వస్తున్న సినిమా. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీ మొత్తంలోనే ఉన్నది. 1000 కోట్లను ఈ సినిమా కోసం ఫిక్స్ చేశారట.

prabhas as lord rama in bollywood movie adipurush
prabhas as lord rama in bollywood movie adipurush

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ప్రభాస్ డైరెక్ట్ గా తొలిసారి బాలీవుడ్ సినిమాను ప్రకటించడం.. అది కూడా రామాయణ ఇతిహాసం మీద రావడం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. మరోవైపు ప్రభాస్ ఏకంగా రాముడిలా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హోప్స్ పెరిగిపోయాయి.

నో డౌట్.. ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ స్టార్ గా ఎదిగిపోతాడు. ఈ సినిమా స్టోరీని నేను విన్నాను. ఇది మామూలు సినిమా కాదు. భారతదేశ సినీ చరిత్రనే తిరగరాసే సినిమా.. అని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా తన మనసులో మాటను బయటపెట్టారు.

మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీగా ఉన్న ఈ సమయంలో వాళ్లకు ఒకే ఒక్క డౌట్ మాత్రం అలాగే మిగిలిపోయింది. అది రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటారు? అని. రాముడిగా ప్రభాస్ సెట్ అవుతారా? లేదా? అంటూ ఎవరికి వారు ఊహించేసుకోవడం మొదలు పెట్టేశారు. ఇంకొందరైతే ఇదిగో.. రాముడిగా ప్రభాస్ ఇలా ఉంటాడు.. అంటూ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

అయితే.. అన్నింటి కన్నా ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటోలో మాత్రం ప్రభాస్.. అచ్చం రాముడిలాగా ఉన్నారు. రాముడిని దించేశారు. వావ్.. ఈ ఫోటోలో ప్రభాస్ అచ్చం రాముడిలా సూపర్ గా సెట్ అయ్యారు. ఫోటో చూస్తుంటేనే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది.. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ లో ప్రభాస్ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో తెలియనప్పటికీ.. మామూలుగా ఫ్యాన్స్ తయారు చేసిన ఫోటో చూస్తేనే ఇలా ఉంటే… సినిమాలో ప్రభాస్ ఇంకెలా కనిపిస్తారో అని ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు.

మొత్తానికి ప్రభాస్.. రాముడిగా ఈజీగా సెట్ అయిపోతారని.. ఈసినిమాతో సినీ ఇండస్ట్రీ దశ దిశ మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.