పోసాని కృష్ణమురళి మనసులో ఏది అనుకుంటే అది మాట్లాడేస్తాడు. ఏమాత్రం ఆలోచించడు. ఎదుటి వారిని తన మాటలతో కట్టడి చేయగల సామర్థ్యం ఆయన సొంతం. అయితే.. పోసాని కృష్ణమురళి గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన గత కొంతకాలంగా కీళ్ల నొప్పుల సమస్యతో బాధ పడుతున్నాడట. ఇటీవలే యశోదా ఆసుపత్రిలో దానికి చికిత్స కూడా తీసుకున్నారట. అయితే.. ఆ ట్రీట్‌మెంట్ వికటించిందట.కీళ్ల నొప్పులకు సంబంధించిన ఆపరేషన్ చేసిన చోట ఇన్‌ఫెక్షన్ వ్యాపించిందట. దీంతో పోసాని తిరిగి ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అందుకే మరోసారి పోసానికి హెర్నియాకు సంబంధించిన ఆపరేషన్ చేశారట. అయితే.. ఆపరేషన్ వికటించిందా? లేదా? అనే విషయంపై అధికారిక సమాచారం మాత్రం లేదు.
పోసాని కృష్ణమురళి పరిస్థితి విషమం !
