త్రివిక్ర‌మ్‌… అదెలా మిస్స‌య్యారు?

కొన్ని పేర్ల‌కు ఓ బ్రాండ్ ఉంటుంది. మాట‌ల‌కు సంబంధించి త్రివిక్ర‌మ్‌కి ఉన్న బ్రాండ్ అలాంటిదే. చిట్టిపొట్టి మాట‌ల‌తో, త‌న స్టైల్ పంచ్ డైలాగుల‌తో ఇట్టే మ‌న‌సుల‌ను ఆకట్టుకుంటారు త్రివిక్ర‌మ్‌. ఆయ‌న డైలాగులు చెప్పాల‌ని ఉవ్విళ్లూర‌ని నాయ‌కులు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కూడా కాదేమో. ఆఖ‌రి డైలాగ్ మ‌న‌దైతే ఆ కిక్కే వేరప్పా అన్న‌ట్టుంటుంది త్రివిక్ర‌మ్ శైలి.

ఆయ‌న తెలుగును ప్రేమించే తీరు చూసి అప్ప‌ట్లో `జ‌ల్సా` పార్వ‌తీ మెల్ట‌న్ నుంచి మొన్న మొన్న `అజ్ఞాత‌వాసి`లో న‌టించిన అను ఇమ్మాన్యుయేల్ వ‌ర‌కూ అంద‌రూ తెలుగు మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆ వంతు పూజా హెగ్డేకి వ‌చ్చింది. ఈ రిలే రేస్‌లో పూజా మంచి మార్కుల్నే వేయించుకుందా?   ప్చ్… ప్చ్…. అస్సలు లేద‌నే అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. నిన్న‌టికి నిన్న విడుద‌ల చేసిన`అర‌వింద స‌మేత‌`లోని  `అన‌గ‌న‌గా..` పాట‌లో పూజా హెగ్డే వాయిస్‌తో కొన్ని డైలాగులు ఉంటాయి. అవి అస‌లు బాగా లేవ‌ని విన్న వాళ్లంద‌రూ పెద‌వి విరుస్తున్నారు.

సింగిల్ ని రిలీజ్ చేయ‌డానికి ముందు ఒక‌టికి ప‌ది సార్లు చెక్ చేసుకునే త్రివిక్ర‌మ్…. పూజా వాయిస్ బాగోలేద‌న్న సంగ‌తిని ఎలా మిస్ అయ్యారు? ఇప్ప‌టికి అయితే అయ్యారు కానీ… సినిమా విడుద‌ల‌కు ఇంకా టైమ్ ఉంది కాబ‌ట్టి ఆమె వాయిస్‌ని రీప్లేస్  చేయ‌మ‌ని ప‌లువురు స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. వారి మాట‌లు వింటారా? త‌న దారి ర‌హ‌దారి అంటారా? అనేది మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ…