పూజా `11` అంకె వెనక టాప్ సీక్రెట్
2020 సంక్రాంతి బరిలో అల వైకుంఠపురములో క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డుల్ని ఈ సినిమా తిరగరాసింది. ఇక ఇలాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో నటించిన పూజా హెగ్డేకి మంచి పేరొచ్చింది. పూజాని త్రివిక్రమ్ బుట్టబొమ్మ పాత్రలో ఎలివేట్ చేసిన తీరు అందరికీ నచ్చింది.
తాజాగా పూజా తలకిందులుగా యోగా ఫీట్ తో దర్శనమిచ్చింది. పైగా రెండు కాళ్లను 11 అంకెలా పైకి ఎత్తేసింది. ఆ లుక్ చూడగానే పూజాకి ఏమైంది? అని కంగారు పడ్డారు ఫ్యాన్స్. అసలింతకీ ఏమైంది? అంటే.. పూజాని ఇన్ స్టాలో 11 మిలియన్ల మంది అనుసరిస్తున్నారట. 1కోటి 10లక్షల మంది ఫాలోవర్స్ దక్కినందుకు ఇలా కాళ్లు పైకెత్తి 11 నంబర్ చూపిస్తోందన్నమాట. ఫీట్ బాగానే ఉన్నా కానీ.. మరీ అంత శ్రమ దేనికో అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక పూజా పొడుగు కాళ్ల వైపే చూస్తూ అల వైకుంఠపురములో చిత్రంలో బన్ని వేసిన వేషాలు తెలిసిందే. అందుకే కాళ్లు పైకెత్తి చూపిస్తోందట.
2020 ఆరంభం పూజాకి బావున్నా కానీ.. ఈ ఏడాది అంతా కెరీర్ ఖాళీ అయిపోయింది. ప్రభాస్ సరసన రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నా.. వైరస్ లాక్ డౌన్ కారణంగా షూటింగులకు వెళ్లే వీల్లేకుండా పోయింది. ఇటీవలే టైటిల్ ని ఫస్ట్ లుక్ ని టీమ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రిచ్ గయ్.. పూర్ గాళ్ లవ్ స్టోరి థీమ్ ని ఎలివేట్ చేశారు. టైటిల్ పోస్టర్ లో పూజా లుక్ అదిరిపోయింది. 2021లోనే ఈ మూవీ రిలీజయ్యే వీలుందని భావిస్తున్నారు.