సంతానంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దిల్లుక్కు దుడ్డు 2 చిత్రం తరువాత నటుడు సంతానం నటించిన చిత్రం ఏ వన్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇదే నెల 26 వ తేది తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్ర టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇప్పుడు అదే వివాదాంశంగా మారింది. ఏ1 చిత్రంలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ విళ్లుపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కొందరు ఫిర్యాదు చేశారు. బ్రాహణ సమాజం అభివృద్ధి సంఘం రాష్ట్ర లక్ష్య సాధన కార్యదర్శి కార్తీక్ ఆధ్వర్యంలో కొందరు మంగళవారం విళ్లుపురం ఎస్పీ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో నటుడు సంతానం నటించిన ఏ 1 చిత్రం త్వరలో తెరపైకి రానుందన్నారు. కాగా ఆ చిత్రంలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగానూ, ఎగతాలి చేసే విధంగానూ సన్నివేశాలు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూద్దాం.
పోలీసులకు ఫిర్యాదు నటుడు సంతానంపై
