`పందెంకోడి-2` బ్యాన్  చేసారు అక్కడ

అవును..నిజమే ఈ రోజు విడుదలైన పందెం కోడి 2 చిత్రాన్ని తమిళనాడులోని తిరుచ్చి ఏరియాలో 40 థియేటర్లలో బ్యాన్ చేసారు. మీరేం చేస్తారో చూసుకోండి..అంటూ విశాల్ కు సవాల్ విసిరారు. అయితే ఆ బ్యాన్ విధించింది ..ఎగ్జిబిటర్ అసోసియేషన్ కావటంతో ఎవరూ ఏం చేయలేని పరిస్దితి.  దీనికి అసలుకారణం ..ఈ చిత్రం పైరసీని పట్టుకుని…ఓ పది థియోటర్స్ లో సినిమా రిలీజ్ ఆపేయటమే.

ఈ రోజు రిలీజ్ సందర్భంగా విశాల్ అండ్ టీమ్ పైరేట్లు కోసం గాలించటం మొదలెట్టారు.  ఆ క్రమంలోనే తిరుచ్చి- తాంజోర్ థియేటర్లో పైరసీకారుల్ని
పట్టుకుని ఆ థియేటర్లో షోలు ఆపేసారు. అక్కడితో ఆగకుండా.. తిరుచ్చి ఏరియాలోని 10 థియేటర్లలో ఎక్కడా సినిమాలు వేయకూడదని విశాల్ టీమ్ ప్రకటనలు ఇచ్చింది.

పైరేట్లను ఎంకరేజ్ చేసే ఇలాంటి చోట సినిమాలు ఆడనివ్వమని ప్రకటన వినటానికి బాగానే ఉంది కానీ ఏ థియోటర్ లో అయితే పైరసీ పట్టుకున్నారో అక్కడ ఆపాలి కానీ…మిగతా థియోటర్స్ లో రిలీజ్ లు ఆపటం ఏమిటి అని గొడవకి దిగారు విశాల్ తో.   అయినా కోర్టు చెప్పకుండా నువ్వెలా మమ్మల్ని బ్యాన్ చేస్తావ్? అంటూ ఎగ్జిబిటర్లు  సర్లే చూసుకో..మేమే నీ సినిమాని బ్యాన్ చేస్తున్నామన్నారు. అదీ సంగతి .