ప్రియుడితో విడిపోయిన హీరోయిన్ కు హాలీవుడ్ అవకాశం !
ఆమధ్య పరిశ్రమలో వరుస అవకాశాలను వదులుకుని షాకిచ్చింది శృతిసాసన్. ప్రియుడు మైఖేల్ మైకంలో శృతి పూర్తిగా మునిగిందంటూ క్రమంగా ఆమెను అప్రోచ్ అవ్వడం మానేశారు దర్శక, నిర్మాతలు. లవర్‌తో పేచీలొచ్చి ఇద్దరూ ఎడబాటుకు సిద్ధమవ్వడంతో -మళ్లీ స్క్రీన్ ప్రజెన్స్‌పై దృష్టిపెట్టింది శృతిహాసన్.
ఒకటి రెండు ఆఫర్లతో సరిపెట్టుకోక తప్పదులే అనుకున్న వాళ్లంతా షాక్ తినేలా -శృతి ఏకంగా హాలీవుడ్ చాన్స్‌లే అందుకుంటోంది. యుఎస్‌ఏ నెట్‌వర్క్స్ నిర్మించనున్న ట్రెండ్ స్టోన్ సిరీస్‌లో కీలకపాత్రకు నిర్మాతలు శృతిని సంప్రదించారట. ఆమె కూడా ఓకే అనడంతో -వెయిట్రెస్ ముసుగులో హత్యలకు పాల్పడే కిల్లర్‌గా శృతి కనిపించే అవకాశం ఉంది.
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఇప్పటికే హాలీవుడ్‌లో పాగావేసిన ప్రియాంకా చోప్రా మాదిరే -ఈ సిరిస్ హిట్టయితే శృతి రేంజ్ కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు.
కెరీర్ కంటే వ్యక్తిత్వమే ముఖ్యమంటున్న !
రోజూ షూటింగుల్లో పాల్గొంటూనే ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మర్చిపోతాం. ఏ తప్పు ఎప్పుడు చేశామో గుర్తుండకపోవచ్చు. అందుకే మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవంటోంది అందాలరాశి శృతిహాసన్.
నన్ను నేను ఎప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను. నాలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను చేసిన తప్పేంటో ఇతరులు చెప్పకముందే గుర్తించేసి సర్దుకుంటాను. నటనలో మన వ్యక్తిత్వంలో ఎప్పటికప్పుడు స్పష్టమైన అభిప్రాయాలు లేకపోతే ఇబ్బందులు తప్పవు అని చెబుతోంది ఈ సుందరి.
కెరీర్ కంటే మన వ్యక్తిత్వమే ముఖ్యమని, ఎప్పటికప్పుడు కెరీర్‌ను నిత్యనూతనంగా రూపొందించుకోవాలంటే మన పర్సనాలిటీ దానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి కెరీర్ ని మరచిపోతున్న తరుణంలో శృతి ఆలోచనా ధోరణి శృతిమించిపోతోంది అంటున్నారు చిత్రసీమకు చెందిన ఆమె సన్నిహితులు.