‘సలార్‌’ ట్రైలర్‌ కోసం అభిమానుల ఆత్రుత!

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’ కోసం అభిమానులతోపాటు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 28న విడుదల కావల్సిన ఈ చిత్రం పలు కారణాల చేత వాయిదా పడింది. డిసెంబర్‌ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ట్రైలర్‌ని డిసెంబర్‌ ఒకటో తేదిన విడుదల చేయనున్నట్లు తెలిసింది. ‘సలార్‌’ ట్రైలర్‌ విడుదల విషయంలో ఎలాంటి వాయిదా లేదు. అలాగే సినిమా డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ కోసం అందరూ సిద్ధంకండి అంటూ సమాచారం వస్తోంది.

అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయిక. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం ను ఈ ఏడాది కిస్మస్‌ పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు.

ఇక మరో విషయమేమంటే..ఈ చిత్రంలో యంగ్‌ పంజాబీ బ్యూటీ సిమ్రత్‌ కౌర్‌ స్పెషల్‌ సాంగ్‌లో మెరువబోతుందన్న అప్‌డేట్‌ ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. బంగార్రాజులో కామియో రోల్‌లో మెరిసిన సిమ్రత్‌ కౌర్‌.. డర్టీ హరిలో కూడా నటించింది. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో స్పెషల్‌ సాంగ్‌ చేస్తుందన్న వార్త ఇప్పుడు నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అఫీషియల్‌ అప్‌డేట్‌ రావాల్సి ఉండగా.. తాజా వార్తతో అప్పుడే సిల్వర్‌ స్కీన్ర్‌పై ప్రభాస్‌, సిమ్రత్‌ కౌర్‌ కాంబోను ఊహించేసుకుంటూ తెగ ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు ఫ్యాన్స్‌. కొరియోగ్రఫర్‌ రాజు సుందరం పర్యవేక్షణలో ఈ సాంగ్‌ ఉండనుంది. వెకేషన్‌ తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్‌ తిరిగొచ్చాడు ప్రభాస్‌.

అయితే ఇంకా సాంగ్‌ షూట్‌లో జాయిన్‌ కావాల్సి ఉంది. మరోవైపు సలార్‌ స్పెషల్‌ సాంగ్‌.. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ఇండియా చిత్రం ‘సలార్‌’.. సినిమా షూటింగ్‌ కూడా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే జరుగుతోంది. సిమ్రత్‌కౌర్‌ తదితరులపై ఓ ప్రత్యేక గీతాన్నిచిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం నృత్య దర్శకత్వం వహిస్తున్న ఈ పాట అదిరిపోయేలా ఉంటుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం.