అక్కడ ‘పెళ్లి చూపులు’ ఫసక్…గౌతమ్ మీనన్ కు షాక్

ఏ మాత్రం ఎక్సపెక్టేషన్స్ లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సాయి దేవరకొండ , రీతూ వర్మ నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం  తెలంగాణలోని లోకల్ లాగ్వేజ్ తో సాగుతుంది.

దాంతో ఈ పెళ్లి చూపులు సినిమాకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. రెండు నేషనల్ అవార్డులు కూడా దక్కాయి. అయితే  బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గటు సినిమాను తెరకెక్కించడమే ఈ సినిమా ఫ్లాఫ్ కు కారణం అంటున్నారు. దాంతో  ఈ సినిమాని హిందీలో మిత్రోన్ పేరుతో  రీమేక్ చేశారు.

 జాకీ భంగానీ, క్రితికా కామ్రా, ప్ర‌తీక్ గాంధీ, నీర‌జ్ సూద్, శివం ఫ‌రేఖ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ మూవీకి నితిన్ క‌క్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం
వ‌హించాడు..ఈ మూవీ 14వ తేదిన బాలీవుడ్ లో విడుద‌లైంది. అయితే ఈ మూవీ ప్లాప్ టాక్ వ‌చ్చింది.. రివ్యూలు కూడా అనుకూలంగా రాలేదు.. ఇక్క‌డ హిట్ సాధించిన మూవీ అక్క‌డ ప్లాప్ కావడానికి మూవీలో ఫీల్ వర్క్ అవుట్ కాకపోవటమేన‌ని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ గౌతమ్ మీనన్ దగ్గర ఉన్నాయి. దాంతో గౌతమ్ మీనన్ సినిమాకు దెబ్బ పడినట్లే అంటున్నారు.