క్రిష్ మామూలోడు కాదు..‘ఆర్‌ఎక్స్ 100’బ్యూటీతో కేక పెట్టించే ప్లాన్

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు కుర్రాళ్ల మనస్సులకు ద‌గ్గ‌రైన గ్లామ‌ర్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ చిత్రంలో బోల్డ్ క్యారెక్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాయ‌ల్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంది. దీంతో వ‌రుస పెట్టి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల‌కి సంబంధించిన ప‌లు ప్రాజెక్టులు ప్ర‌స్తుతం పాయ‌ల్ చేతిలో ఉండ‌గా, తెలుగులో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్‌లో పాయ‌ల్‌ని జ‌య‌సుధ పాత్ర‌కి ఎంపిక చేశార‌ని మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. మొదట వేరే వాళ్లను అనుకున్నా…ఆమెకు ఉన్న క్రేజ్ గమనించిన క్రిష్ ఆమెను సీన్ లోకి లాక్కొచ్చాడంటున్నారు.ఆమెతో ఈ సినిమా పాత సాంగ్ ఒకటి రీమిక్స్ చేస్తారని తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ నటించిన పలు హిట్ చిత్రాల్లో జయసుధ ఆయనకు జోడిగా నటించింది. వారి పెయిర్ కు మంచి క్ర్జేజ్ ఉండేది. అందుకే యన్‌టిఆర్ బయోపిక్‌లో జయసుధకు ప్రాధాన్యత ఉందని .. ఆ పాత్రకు పాయల్ బాడీ లాంగ్వేజ్‌ కరెక్ట్‌గా సెట్ అవుతుందనే ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో ‘యన్‌టిఆర్’ ఒకటి. మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. కాగా బాలకృష్ణ ప్రధానపాత్రలో రెండు భాగాలుగా రానున్న యన్‌టిఆర్ చిత్రాలు వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రంలో పలు పాత్రల కోసం రకుల్ ప్రీత్, విద్యాబాలన్, రానా, సుమంత్ లాంటి భారీ తారాగణం ఎంపిక చేసిన క్రిష్.. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్‌ని ఎంపిక చేయ‌డం గొప్ప విష‌య‌మే. ఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది రెండు పార్టులుగా విడుద‌ల కానుంది.