తన కొత్త సినిమా పై పవన్ అఫీషియల్ స్టేట్మెంట్ !

నిన్నటి నుంచి ఇంటర్నెట్ లో పవన్ మళ్లీ సినిమా చెయ్యబోతున్నారంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అంతేకాదు పవన్ చేయబోయే సినిమా బొబ్బిలి పులి తరహాలో ఉండబోతోందని కూడా ఊహాగానాలు వినిపించాయి. అక్కడితో ఆగకుండా పవన్ ని గోపాల గోపాల ఫేం డాలీ డైరక్ట్ చేయబోతున్నారని అన్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తారని చెప్పారు. ఇలా వార్తలు ఒకదానికొకటి లింక్ లా పెద్ద చైన్ లా సాగింది. అయితే ఈ వార్తల్లో అసలు నిజం లేదని పవన్ తేల్చేస్తూ ఓ అఫీషియల్ స్టేట్మెంట్ వదిలారు. ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసారు.

త్రివిక్రమ్ తో చేసిన అజ్ఞాతివాసి చిత్రం తరువాత పవన్ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ప్రతీక్షణం ప్రజల మధ్యే ఉంటూ పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో విస్త్రుతంగా పర్యటిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న తన గురించి సోషల్ మీడియాలో , వెబ్ మీడియాలో వస్తున్న వార్తలను విని ఆశ్చర్యపోయారట. త్వరలోనే తాను ఒక చిత్రంలో నటించనున్నారని అనే విషయం ఆయనకు కూడా తెలియకుండా ఎలా స్ప్రెడ్ అయ్యిందో అన్నారట. అయితే అభిమానులు కన్ఫూజ్ కాకుండా ఉండటం కోసం వెంటనే ప్రకటన చేసి క్లారిటీ ఇచ్చేసారు.

ట్విట్టర్ లో ఈ వార్తల ఫై పవన్ స్పందిస్తూ నేను సినిమాలో నటించనున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాకు అంత సమయం లేదు. నా దృష్టి అంత ప్రజా క్షేమం కోసమే, నా తపన అంతా సమాజ స్థాపన కోసమే అంటూ ఒక లెటర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ న్యూస్ ఆయన అభిమానులకు ఆనందం కలిగిస్తుందా లేదా నిరాశ కలిగిస్తుందా..చూడాలి.