ఇన్సైడ్ టాక్ : అన్నయ్య “గాడ్ ఫాదర్” కి పవన్ హ్యాండివ్వబోతున్నాడా.?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర మంచి అంచనాలు ఏర్పరచుకొని రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మెగా మల్టీ స్టారర్ “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లు నటించిన ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై గత కొన్ని రోజులు నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు సినీ వర్గాల్లో వినిపించాయి. అయితే వాటిలో ఈ సినిమాపై హైప్ ని నిలబెట్టడానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ కోసం తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ కి వస్తున్నాడని ఓ టాక్ పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది.

అలాగే ఇప్పటికీ కూడా పవన్ ని ఎలాగైనా తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారట. కానీ పవన్ మాత్రం ఈ సినిమాకి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ ఉన్న బిజీలో విదేశాలకి వెళ్తున్నాడని అందుకే గాడ్ ఫాదర్ ప్రీ రెలీయే టైం కి రాకపోవచ్చని ఇన్సైడ్ టాక్.

దీనితో అయితే మెగా ప్లాన్ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. మరి లాస్ట్ మినిట్ వరకు అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాని అయితే మోహన్ రాజా దర్శకత్వం వహించాడు అలాగే థమన్ సంగీతం అందించగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు తెలుగు హిందీలో నిర్మించారు.