ప‌వర్ స్టార్ బ‌యోపిక్.. ఆర్జీవీపై రామ‌జోగయ్య ఆక్రోశం!!

                               రామ్ గోపాల్ వ‌ర్మపై లిరిసిస్ట్ ఆవేద‌న‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. క‌థానాయ‌కుడిగా.. జ‌న‌సైనికుడిగా ప్ర‌జ‌ల్లో అభిమానం సంపాదించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ జీవిత‌క‌థ‌తో సినిమా తీసే ప్ర‌య‌త్నం చేస్తే స్పంద‌న ఎలా ఉంటుందో ఊహించేదే. పైగా ప‌వ‌న్ శ‌త్రువు అయిన ఆర్జీవీ ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ అంటూ సెటైరిక‌ల్ మూవీ తీసేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు స‌హా ప‌వ‌న్ వీరాభిమానుల్లో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప‌లువురు ఆర్జీవీపై ఎటాక్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక కొంద‌రు ఏమీ చేయ‌లేని స్థితిలో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇటు ప‌వ‌ర్ స్టార్ కి అటు ఆర్జీవీకి కామ‌న్ అభిమాని అయిన సీనియ‌ర్ లిరిసిస్ట్ రామ‌జోగయ్య శాస్త్రి తీవ్రంగా హ‌ర్ట‌య్యి ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

“ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని  చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం…మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్….మీరేమీ  రిప్లై ఇవ్వక్కర్లేదు..తెలివిగా ఎదో చెప్పేస్తారు…నేను హర్ట్“ అంటూ స్వీట్ గా ఆర్జీవీని క‌ట్ చేశారు రామ‌జోగ‌య్య‌. మొత్తానికి పాము చావ‌కుండా క‌ర్ర విర‌గ‌కుండా రామ‌జోగ‌య్య ఇలా త‌న కోపం వ్య‌క్తం చేశారు. అంటే అటు ప‌వ‌న్ వ‌ద్ద ఛాన్సులు పోవు. ఇటు ఆర్జీవీ లిరిక్ రాసే అవ‌కాశం ఇవ్వ‌క‌పోడు!! అన్న‌ట్టుగానే ఉంది ఈ నివేద‌న.

https://twitter.com/ramjowrites/status/1277148515366391808