వర్మ తన పైత్యాన్ని మొత్తం రంగరించి తన ‘పవర్ స్టార్’ సినిమాను బాగా ప్రమోట్ చేసుకున్నాడు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రవన్ పరిస్థితి అంటూ సినిమా చేసి ఇది పవన్ కళ్యాణ్ గురించిన సినిమా కానే కాదని కేవలం కల్పిత పాత్రలని అంటూ పవన్ ను పోలిన వ్యక్తిని ప్రధాన పాత్రలో పెట్టి, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును టైటిల్ పోస్టర్ మీద పెట్టి, పవన్ రాజకీయ, వ్యక్తిగత జీవితాలలోని వ్యక్తులను, అంశాలను ప్రస్తావిస్తూనే ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఆది కూడా పాతిక రూపాయల ఖరీదుకు చూడాలని షరతు పెట్టాడు. ఆ తర్వాత అది ఎలాగూ స్వీయ లీకుల ద్వారా యూట్యూబ్ మాధ్యమంలో విడుదలైంది.
ఈ సినిమా పట్ల పవన్ అభిమానులు తీవ్ర నిరసన తెలిపారు. ఆర్జీవీ ఆఫీసు మీద దాడికి కూడా దిగారు. వర్మ ఒక్కో స్టిల్ వదులుతూ ఒక్కో వ్యంగ్యమైన ట్వీట్ వేస్తూ ఉంటే అభిమాణులు, కార్యకర్తలు ఉడికిపోయారు. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే రెండో వైపు వర్మ పనుల్ని పవన్ హేటర్స్ బాగా ఎంజాయ్ చేశారు. అధికార పార్టీ అభిమానులు, టీడీపీ మద్దతుదారులు సినిమాను బాగా ప్రమోట్ చేశారు. గతంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ మీద సినిమా చేస్తే మేము క్షోభ పడ్డాం, ఇప్పుడు మీరు కూడ క్షొభించండి అంటూ పవన్ అభిమానులకు సెటైర్లు వేశారు. ట్రైలర్లోనే వర్మ పవన్ ను, పార్టీని ఇంత బద్నాం చేశాడు ఇక సినిమాలో ఎంతలా ఆడుకుని ఉంటాడో చూడాలని తపించిపోయారు.
సినిమాను చూడటానికి రూ.150 ప్లస్ ట్యాక్స్ కట్టదానికి రెడీ అయ్యారు. 11 గంటలకు రిలీజ్ కావడంతో డబ్బు కట్టి సినిమా చూసేశారు. చూశాక గానీ తెలీలేదు వాళ్లకు వర్మ తెలివేమిటో. గత కొన్నాళ్ళుగా వర్మ ట్రైలర్ దర్శకుడని నిరూపితమవుతూనే ఉంది. ఈ సినిమాతో కూడా అదే రుజువైంది. ట్రైలరుకు మించి సినిమాలో ఏమీ లేదట. ఆహా..ఓహో అంటూ ఎగిరిన వారంతా సినిమా చూసి అమ్మ వర్మా.. మా చేత 150 రూపాయలు కట్టించడానికి ఎంత కథ నడిపావ్. అయినా పవన్ మీద సెటైర్లు వేస్తావనుకుంటే మా లీడర్ మీదే వేశావ్ కదా.. ఇది మోసం.. పచ్చి మోసం అంటూ సోషల్ మీడియాలో వాపోతున్నారు. రివ్యూయర్లు సైతం ట్రైలర్లకు మించి సినిమాలో ఏమీ లేదని, కొందరు అనుకున్నట్టు పవన్ మీద దారుణమైన ట్రోల్స్ లేవని అంటున్నారు.