వీడియో : పందెం కోడి 2 టీజర్

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పందెంకోడి 2’. గతంలో మాస్‌ హీరో విశాల్‌, ఎన్‌.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘పందెంకోడి’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం  ‘పందెంకోడి 2’. 

ఈ సినిమాలో విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ నేడు (శుక్రవారం) రిలీజ్ అయింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 2008లో వచ్చిన పందెంకోడి సినిమాతో టీజర్ స్టార్ట్ అవుతుంది. విశాల్ చెప్పే ఎమోషనల్  డైలాగ్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ తన హావభావాలతో  ఆకట్టుకుంది.

 

పందెం కోడి 2 టీజర్