సొంతూర్లో చావటం కూడా అదృష్టమే

పల్లె వాసనను పట్టె సినిమాలు తగ్గిపోయాయి. సినిమా సిటీకు ఎప్పుడో చేరింది. అయితే అప్పుడప్పుడూ ఆ నేపధ్యంనుంచి వచ్చిన వాళ్లు ఆ కలను, కన్నీళ్లను మరువేక, తమ ఆవేదనను, ఆర్ధ్రతను సినిమా రూపంలో మన ముందుచుతూ ఉన్నారు. అలాంటి సినిమానే అనిపిస్తోంది “పల్లెవాసి” టీజర్ చూస్తూంటే.

“బాగుపడదామని అమెరికా వెళ్లాను. కానీ బాగు ఎక్కడుంది. నా ఊరిలో ఉంది. నా జనాల మధ్య, నా మట్టిలో, నా పొలంలో ఉంది.నిజానికి సొంతూర్లో చావటం కూడా అదృష్టమే”. అనే డైలాగుతో సాగే ఈ టీజర్ పల్లె నేపధ్యం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందనటంలో సందేహం లేదు.

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం “పల్లెవాసి”. ఈ చిత్రం టీజర్ ఈ రోజు విడుదల అయ్యింది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

pallevaasi official teaser #rakendu mouli#kalki#meka ramakrishna#suman#ramprasad#sainath gorantla#

ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు. కల్కి హీరోయిన్. మేకా రామకృష్ణ, సుమన్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు.

చిత్ర దర్శకుడు గోరంట్ల సాయినాధ్ మాట్లాడుతూ …పల్లెటూరి నేపధ్యమున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా “పల్లెవాసి”. ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది అన్నారు.

నిర్మాత రాంప్రసాద్ మాట్లాడుతూ..ఇటీవలే షూటింగ్ పూర్తి అయింది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ‘పల్లెవాసి ‘ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

ఈ చిత్రానికి రచన, నిర్మాత: జి. రాం ప్రసాద్
సహా నిర్మాత : ఉదయ్ కుమార్ యాదవ్
కెమెరామెన్: లక్ష్మణ్,
కో డైరెక్టర్: శ్యాం,
సంగీతం : కె .సందీప్ కుమార్
ఎడిటర్ :జానకిరామ్ పామరాజు
పి.ఆర్.ఓ : సాయి సతీష్ ,.