వారం రోజులపాటు ఆశ్రమంలో ఏమి చేసింది హీరోయిన్ !

ఒక ఆశ్రమంలో గడిపొచ్చానని చెప్పింది నటి నిత్యామీనన్‌. ఏంటీ ఈ భామ ఆధ్యాత్మిక మార్గం పట్టిందా. అని అనుకోకండి. తనకు నచ్చింది చేసే అరుదైన నటి నిత్యామీనన్‌. సినిమాలైనా తనకు నచ్చితే చిన్న పాత్రను చేయడానికైనా సిద్ధం అంటుంది. అలా అతిథి పాత్రల్లో నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్‌ నటించిన మిషన్‌ మంగళ్‌ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులోనూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది. ఆశ్రమంలో అక్కడ మతం గురించి నేర్చుకోలేదు గానీ, నా గురించి నేను తెలుసుకున్నానని చెప్పింది. వారం రోజులు ఉన్నాను.అయితే అక్కడ విల్ పవర్ పెంపొందించుకోవచ్చు అని చెప్పింది.అయితె పాఠాలు నేర్పడానికి చాలా కళాశాలలు ఉన్నాయి.

మనుషులైన మన గురించి ఏ కళాశాలల్లోనూ చెప్పడం లేదు అని అంది ఇకపోతే నటిగా తన గురించి చెప్పాలంటే తాను నటించే పాత్రల కోసం ముందుగా ఎలాంటి శిక్షణ తీసుకోనని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పాత్రనైనా కష్టపడి నటించను. షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లిన తరువాత అక్కడ యూనిట్‌ వాళ్లు ఇచ్చిన దుస్తులు ధరించగానే నిత్యామీనన్‌ అన్న విషయాన్ని మరిచి ఆయా పాత్రలుగా మారిపోతానని చెప్పింది. ప్రస్తుతం ది ఐరన్‌ లేడీ చిత్రంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నిత్యామీనన్‌ పేర్కొంది.