నా ప్రమేయం లేకుండానే నా పెళ్లి చేసేస్తారా.. పెళ్లి వార్తలపై స్పందించిన నిత్యామీనన్?

మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె మలయాళీ నటి అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.నందిని రెడ్డి దర్శకత్వంలో తెరికెక్కిన అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిత్యామీనన్ తెలుగులో పలు సినిమాలలో నటించిన గుర్తింపు పొందింది.ఈ విధంగా తెలుగు మలయాళం తమిళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందిన నిత్యామీనన్ తాజాగా భీమ్లా నాయక్ సినిమాతో మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది.

ఈ విధంగా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తూ వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నా నిత్యమీనన్ కి సంబంధించిన ఓ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిత్యామీనన్ ఇండస్ట్రీలోకి రాకముందే ఒక మలయాళీ హీరోతో పరిచయం ఏర్పరచుకొని అతనితో ప్రేమలో పడిందని అయితే ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే నిత్యమీనన్ పెళ్లి గురించి ఈ వార్త వైరల్ కావడంతో ఈ వార్తలపై నిత్యమీనన్ స్పందించారు.

ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ తన ప్రమేయం లేకుండానే తన పెళ్లి చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం తన పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని ఇవన్నీ కేవలం వట్టి పుకార్లు మాత్రమేనని ఈమె తన పెళ్లి వార్తలను కొట్టి పారేశారు.ఈ విధంగా నిత్యామీనన్ పెళ్లి వార్తల పై స్పందించడంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె నటించిన హైదరాబాద్ మోడ్రన్ లవ్ అనే వెబ్ సిరీస్ అమెజాన్ లో ప్రసారమవుతు ప్రేక్షకులను సందడి చేస్తోంది.