నిత్యా ఘాటైన లిప్ లాక్ లతో చెలరేగిందే
స్వలింగ సంపర్కం నేరం కాదు! అని కోర్టులు తీర్పులిచ్చాయి. అయినా పబ్లిగ్గా లెస్బియన్లు చెలరేగిపోవడం కుదరదు. దీనిపై ఇప్పటికీ సాంప్రదాయవాదులు భగ్గుమంటూనే ఉన్నారు. ఇక అప్పుడప్పుడు వెండితెరపై కథానాయికలు స్వలింగ సంపర్కంతో చెలరేగిపోవడం సంచలనంగానే చూశారు. ఇష్కియా.. అలీఘర్.. అన్ ఫ్రీడమ్ ఇలా ఎన్నో బాలీవుడ్ సినిమాలు స్వలింగ సంపర్కం నేపథ్యంలో వచ్చినవే. అలాగే దోస్తానా సిరీస్ లో మేల్ లెస్బియన్స్ స్టోరీతో తెరకెక్కి నవ్వులు పూయించింది.
షబానా ఆజ్మీ- నందితాదాస్ కాంబినేషన్ లో దీపా మెహతా తెరకెక్కించిన లెస్బియన్ మూవీ ఫైర్ ఎంతటి సంచలనమో తెలిసిందే. ఇక నెట్ ఫ్లిక్స్ అమెజాన్ లాంటి చోట లెస్బియన్ వెబ్ సిరీస్ లకు కొదవేమీ లేదు. తాజాగా అలాంటి సంచలనమే ఇది. ఈసారి లెస్బియన్ యాక్ట్ చేసింది నిత్యామీనన్ కావడంతో అభిమానుల్లో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది.
https://twitter.com/LargoWinch98/status/1282532939641708544
నిత్యామీనన్ ఎంతో సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటించింది. తెలుగు ఆడియెన్ మరో సౌందర్య అంటూ అభిమానించారు. అలాంటి గ్రేట్ నటి నిత్యా ఇలా స్వలింగసంపర్కురాలిగా చెలరేగుతుందనుకోలేదు. సాటి నాయిక శృతి బాప్నాతోతో పెదవి పెదవి కలిపి లిప్ లాక్ వేసింది. ఘాటైన రొమాన్స్ చేసింది. కార్ లో ఆరు బయట చెలరేగిపోయింది. ఇదంతా దేనికోసం అంటే అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న `బ్రీత్ : ఇన్ టూ ది షాడోస్` వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం. నిజానికి ఈ సిరీస్ లో అసలు లిప్ లాక్ లు లెస్బియన్ యాక్ట్ అన్నది లేనే లేదు. నిత్యా కేవలం నటి మాత్రమే. కానీ తాజాగా లెస్బియన్ యాక్ట్ కి సంబంధించిన వీడియో లీకై సంచలనమైంది. ప్రస్తుతం ఇది యువతరం వాట్సాపుల్లో వైరల్ గా మారింది.