కన్ను గీటి యావత్ భారతదేశాన్ని తన కను సన్నల్లో తిప్పుకున్న బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె వల్లే తమ సినిమా సర్వ నాశనం అయ్యిందంటున్నారు దర్శకుడు ఒమర్. ప్రియా ప్రకాష్ నటించిన తొలి సినిమా లవర్స్ డే డిజాస్టర్ కు ఆమెను కారణం చేస్తూ మీడియా ముందు మాట్లాడారు.
‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో అనుకోకుండా కన్నుకొట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ సంచలనం అయిపోయిందని.. అదే తమ సర్వ నాశానానికి దారితీసిందని అన్నారు. ఆ కన్ను కొట్టే సీన్ సెన్సేషన్ కావడంతో నిర్మాతలు కూడా తమ బిజినెస్ పెరగటం కోసం సినిమా కథ కూడా మార్పించేసారని.. స్క్రిప్ట్ ఇష్టమొచ్చినట్లు తిప్పేసి తన కెరీర్ కే దెబ్బకొట్టారని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఒమర్.
ప్రియా ప్రకాష్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేవరకు… ప్రియా ప్రకాష్ ది సైడ్ క్యారెక్టర్. కానీ నిర్మాతలు ఆమెనే హీరోయిన్ గా పెట్టాలని పట్టుబట్టడంతో తనకు వేరే దారి లేక ఒప్పుకోవాల్సి వచ్చిందని దర్శకుడు ఒమర్ లులు వెల్లడించారు. మొదట అనుకున్న హీరోయిన్ నూరిన్ ని పక్కన పెట్టి ప్రియా చుట్టూ కథ తిరిగేలా మార్చడంతో సినిమాకి అనుకున్న రిజల్ట్ రాలేదని వాపోయారు.
ఆ పాట హిట్ అవగానే ..తాను నిర్మాతను కలిసి క్రేజ్ వచ్చింది కాబట్టి మంచి క్వాలిటీతో సినిమా తీద్దామని రిక్వెస్ట్ చేసానని, కానీ తన మాట ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. మళయాళ , తెలుగు నిర్మాతలు ఇద్దరూ ఎట్టి పరిస్దితుల్లోనూ ప్రియ ప్రకాష్ నే హీరోయిన్ గా మెయిన్ లీడ్ గా పెట్టాలని పట్టుబట్టారని అన్నారు. దాంతో మొత్తం రీషూట్ చేసామని చెప్పుకొచ్చారు.
ఇంత తాము కష్టపడినా ప్రియా ప్రకాష్ మాత్రం సినిమా విడుదలైన తరువాత ప్రమోషన్స్ కి రాలేదని.. ఆమె ప్రచారం చేసి ఉంటే వసూళ్లు పెరిగి ఉండేవని అన్నారు. ప్రియాప్రకాష్ కి నటన రాదని ఆమెతో ఎక్సప్రెషన్స్ పలికించలేకపోయానని, కాసేపు కనబడే పాత్ర కాబట్టి తీసుకున్నానే కానీ హీరోయిన్ వేషమైతే ఇచ్చేవాడినే కాదని డైరక్టర్ … మండిపడ్డారు.