ఎన్టీఆర్ బయోపిక్ కు క్లీన్ యు

మహానటుడు , నాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు ఈరోజు సెన్సార్ అయ్యింది . ఈ చిత్రానికి సెన్సార్ వారు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీచేసినట్టు తెలిసింది .  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను రెండు భాగాలుగా రూపొందించిన విషయం తెలిసిందే .
ఈనెల 9న ఈ సినిమా విడుదలవుతుంది . మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు దర్శకుడు క్రిష్ చెప్పినట్టు తెలిసింది .ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించగా హిందీ నటి విద్యా బాలన్ బసవతారకంగా నటించారు .

అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్ , నారా చంద్ర బాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించారు . ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు . మొదటి భాగంలో ఎన్టీఆర్ సినిమా జీవితానికి సంబంధించి ఉంటుందని తెలిసింది . సినిమా బసవ తారకం కోణం నుంచే మొదలవుతుందని ఆమె చనిపోవడంతో తొలి భాగం పూర్తి అవుతుందని తెలిసింది .