‘యన్‌టిఆర్‌’ సాంగ్ లో… ‘మీ వీరాభిమాని కీరవాణి’

నందమూరి తారకరామరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యన్‌టిఆర్‌’. క్రిష్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ బయోపిక్‌లోని టైటిల్‌ సాంగ్‌కు చెందిన లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రంలోని మిగతా పాటలతో పోలిస్తే ఈ పాట అటు మాస్‌ను ఇటు క్లాస్‌ ప్రేక్షకులను అలరించే విధంగా ఉండేలా అందరినీ ఆకట్టుకుంటోంది.

NTR, More than a hero! Lyrical Video Song | NTR Biopic | Kaala Bhairava, Prudhvi Chandra

‘నువ్వు రాముడు వేషమే కట్టావంటే గుండెలు అన్నీ గుడులైపోతాయే..’ అంటూ సాగుతున్న ఈ పాటను కాల భైరవ, పృథ్వీ చంద్ర ఆలపించారు. ఇందులో ఎన్టీఆర్‌కు సంబంధించిన అప్పటి పాత ఫొటోలను కూడా చూపించారు. వీడియో చివర్లో ఎన్టీఆర్‌తో కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎం.ఎం కీరవాణి దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. దానిపై ‘మీ వీరాభిమాని కీరవాణి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న ‘కథానాయకుడు’ పేరుతో విడుదల కానుంది. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకూ జరిగిన సంఘటనలకు దీనిలో దృశ్యరూపం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక సీఎం అయిన దగ్గరి నుంచి ఆయన మరణించే వరకూ చోటు చేసుకున్న సంఘటనలను ‘మహానాయకుడు’ పేరుతో పిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సమర్పిస్తున్నాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.