ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత .. వీర రాఘవ ” చిత్రం ఈనెల 11న విడుదల చేస్తున్నారు . ఈ సందర్భంగా మంగళవారం నాడు హైద్రాబాద్లో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం తరువాత జరిగిన కార్యక్రమం ఇది . ఈ కార్యక్రమంలో తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో వచ్చాడు ఎన్టీఆర్. అతను దుఃఖాన్ని దిగమింగుకుంటూ ప్రసంగించారు . తండ్రి పట్ల అతనికి ఎంత గాఢమైన అనుబంధం ఉందొ తెలిసింది . తండ్రి లేని లోటు ఏమిటో ఎన్టీఆర్ ను చూస్తే అర్ధమైంది .
అయితే అరవింద సమేత .. వీర రాఘవ సినిమాకు తమ కుటుంబానికి ఎదో తెలియని సంబంధం ఉందని చెప్పి అందరినీ ఆశర్య చకితులను చేశాడు . తాను ఇంతవరకు 27 చిత్రాల్లో నటించానని అయితే ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే సన్నివేశాల్లో నటించలేదని చెప్పాడు .
త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు ఎప్పటినుంచో పరిచయం ఉందని , కానీ అతనితో సినిమా చెయ్యలేకపొయ్యానని చెప్పాడు . 12 సంవత్సరాల తరువాత అరవింద సమేత చేశానని .. ఈ చిత్రంలో తండ్రి పాత్ర చనిపోతే నిప్పు పెట్టానని , అది నిజ జీవితంలో జరుగుతుందని వూహించలేకపోయానని ఉద్వేగంగా చెప్పాడు .
అందుకే ఈ సినిమా ఇన్ని సంవత్సరాలు పట్టిందని తానూ భావిస్తున్నానని ఎన్టీఆర్ చెప్పాడు .. సినిమాలోని ఘటన నిజ జీవితంలో జరగడం యాదృచ్చికమే కావచ్చు. కానీ తనని బాగా కలసి వేసిందని చెప్పాడు. తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని , ఆయన ఎక్కడ వున్నా తమని ఆశీర్వదిస్తాడనే నమ్మకం ఉందని ఎన్టీఆర్ చెప్పాడు.