బాలకృష్ణ కథానాయకుడు గట్టి దెబ్బె కొట్టాడని తెలుగు సినిమా రంగంలో ప్రచారం జరుగుతుంది . ఎంతో ఆర్బాటంగా , ఎక్కువమంది నటీనటులతో, భారీ అంచనాలతో ఈ నెల 9న విడుదల చేసిన “ఎన్టీఆర్ బయోపిక్ ” కలెక్టన్ల వర్షం కురిపిస్తున్ది అనుకున్నారు . సంక్రాతి పండగ కాబాట్టి నాలుగైదు రోజులు ఊహించని విధంగా డబ్బు వాసులు చేస్తుందని అందరు ఊహించారు.
కానీ నిర్మాత దర్శకులకు ఈ సినిమా విడుదలై పెద్ద షాక్ ఇచ్చింది . మొదటిరోజే కొన్ని థియేటర్ లలో మేటినీ , ఫస్ట్ షోలు ఫుల్ కాలేదు . ఎక్కువ థియేటర్ లు వెయ్యడం వల్ల అలా జరిగిందని అనుకున్నారు . ఇంకా కొందరు బాలకృష్ణ కెపాసిటీ కి మించి వేయడం వల్లనే కలెక్షన్లు లేకుండాపోయాయని అన్నారు. రెండవ రోజు మూడవ రోజుకు థియేటర్లు తగ్గిపోయాయి . ఇప్పుడు కలెక్షన్స్ పెరుగుతాయని ఊహించారు . కానీ బాగా తగ్గిపోయాయి .
ఈ పరిణామం బాలకృష్ణ జీర్ణించుకోలేకపోయారు . ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 70. 58 కోట్లు చేశారు . 6 రోజులకు వాసులు చేసిన షేర్ 15. 50 కోట్లు మాత్రమే . ఫలితంగా రెండవ భాగం “ఎన్టీఆర్ మహా నాయకుడు” ఫిబ్రవరి 7 న విడుదల చేస్తామని నిర్మాత దర్శకులు మొదట ప్రకటించారు , కానీ కథానాయకుడు దెబ్బకు రెండవ భాగం వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది .