ఇండస్ట్రీ టాక్ : ఎన్టీఆర్ విషయంలో ఫ్యాన్స్ సంతోషంగా లేరా..?

తెలుగు సినిమా దగ్గర ఉన్న అతి పెద్ద స్టార్ హీరోలలో మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ గా కూడా భారీ పేరు సంపాదించుకోగా ఇక్కడ నుంచి అభిమానుల్లో కూడా అంచనాలు పెరిగాయి.

సరే ఇదంతా బాగానే ఉన్నా మరో పక్క ఎన్టీఆర్ నుంచి పొలిటికల్ గా కూడా ఏదోకటి తగులుతూనే ఉంది. దీనితో అభిమానులు కూడా కాస్త ఆందోళనగా ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ చేసిన పనికి సంతోషంగా లేరనే మాట ఎక్కువగా కనిపిస్తుంది.

ఏపీలో సీనియర్ ఎన్టీఆర్ పేరుని ఓ యూనివర్సిటీ కి మార్చడం అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది. మరి ఈ అంశంలో ఎన్టీఆర్ స్పందించిన తీరు అతని ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసిందట. ఎన్టీఆర్ ఇలాంటి విషయాల్లో కూడా గట్టిగా ప్రశ్నించలేకపోవడం బాగాలేదని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా ఇలా బ్యాలన్సుడ్ గా మాట్లాడ్డం కరెక్ట్ కాదని ఇంకా నందమూరి కళ్యాణ్ రామ్ ఈ విషయంలో గట్టిగా స్పందించాడని ఎన్టీఆర్ అయితే ఆ తరహాలో మాట్లాడి ఉంటే బాగుండేది అని వారు అంటున్నారు. మొత్తానికి అయితే ఎన్టీఆర్ స్టేట్మెంట్ విషయంలో చాలా వరకు ఫ్యాన్స్ నిరాశే పడ్డారు.