‘అరవింద సమేత’కథలో కీలకమైన ట్విస్ట్ ఇదేనట

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం
వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం గురించి అభిమానులు ఊహించని ఓ విషయం బయిటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయిల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి, కొడుకుల పాత్రల్లో కనిపిస్తారట. అలాగే సినిమాలో తన తండ్రి గురించి కొడుకు పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌కు వివరించే సమయంలోనే ‘పెనివిటీ..’ పాట ఉంటుందని చెప్తున్నారు.

తండ్రి పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌కు జోడీగా ఈషా రెబ్బా నటిస్తున్నారని, ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయాలని కావాలనే ఈ విషయాన్ని దాచారట చిత్ర యూనిట్. అలాగే ఎన్టీఆర్, రావు రమేశ్‌ల మధ్య  పొలిటికల్ సీన్స్  కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టాక్‌.   ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఎస్‌. రాధాకృష్ణ నిర్మాత గా రూపొందుతున్న ఈ సినిమాలు  జగపతిబాబు, నాగబాబు, రావు రమేశ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.