మహా నటుడు, నాయకుడు అయిన నందమూరి తారక రామారావు జీవితం పై బాలకృష్ణ కథానాయకుడుగా జాగర్లమూడి క్రిష్ దర్శత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా చేసి విడుదల చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి . హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చాలా మందికి అర్ధం కావడం లేదు . చిత్రీకరణ మధ్యలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని
అనుకుంటున్నారు .
ఎన్టీఆర్ ది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం , జీవితం. ఆయన జీవితంలో మూడు భాగాలున్నాయి . ఒకటి సినిమా కథానాయకుడు , రెండు సామాజిక సేవకుడు , మూడు రాజకీయ నాయకుడు . ఇంతటి వైవిధ్యమైన జీవితాన్ని రెండున్నర లేక మూడు గంటల్లో చూపించటం వాళ్ళ న్యాయం చెయ్యాలేక పోవచ్చు . అదే రెండు భాగాలుగా చేస్తే ? వ్యాపార పరంగా లాభం ఉంటుందా ? అనవసరమైన రిస్క్ ఉంటుందా ? అనే అనుమానంతో ఎన్నాళ్ళు వేచి వున్నారు . అయితే ఈ సినిమాను ఒక ఛాలెంజి గా తీసుకున్నారు బాలకృష్ణ, క్రిష్ . ఈ సినిమాలో బాలకృష్ణకు, మహేష్ ,రానా దగ్గుబాటి , సుమంత్ విద్యాబాలన్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ప్రకాష్ రాజ్ , నిత్యా మీనన్ ,కైకాల సత్యనారాయణ,
నరేష్ మొదలైన వారు నటిస్తూ ఉండటంతో ఈ సినిమాకు వ్యాపార పరంగా పెద్ద క్రేజ్ వచ్చింది .
అమెజాన్ లాంటి పెద్ద సంస్థ లు పెద్ద మొత్తంలో ఆఫర్ ఇవ్వడంతో బాలకృష్ణ , క్రిష్ రెండు భాగాలుగా విడుద చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారట . అందుకే ఈ విషయం మీడియా ద్వారా తెలిపారు .
మొదటి భాగంలో ఎన్టీఆర్ పుట్టుక , చదువు , ఉద్యోగం , సినిమా రంగ ప్రవేశం , రాయల సీమ కరువు, చైనా యుద్ధం, దివి సీమ ఉప్పెన సందర్భగా రామారావు ప్రజల కోసం చేసిన సేవ , రాజకీయాల్లోకి అడుగు పెట్టి తెలుగు దేశం పార్టీ స్థాపన ,ప్రచారం , 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటాయట . అందుకే మొదటి భాగానికి “కథానాయకుడు ” అనే పేరు పెట్టారు . సెంటిమెంట్ గా రామారావు ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే సినిమాను విడుదల చేస్తున్నారు .
ఇక రెండవ భాగంలో 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర రావు, రామారావు అమెరికా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడం, దానిపై రామారావు గవర్నర్ రాంలాల్ తో గొడవపడి అరెస్ట్ కావడం, ప్రతి పక్షాలన్నీ ఏకమై పోరాటం చెయ్యడం , కేంద్రం దిగి వచ్చి మళ్ళీ రామారావును ముఖ్యంన్త్రిగా చెయ్యడం వంటి దృశ్యాలు వుంటాయని అంటున్నారు .
మరి లక్ష్మి పార్వతిని వివాహం చేసుకునే ఘటన కూడా ఉంటుందని , లక్ష్మి పార్వతి పాత్రకు ఆమనిని ఎంపిక చేశారని తెలిసింది . అయితే రామారావు 1994 డిసెంబర్ 12న మూడవ సారి ముఖ్యంమత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు . 1995 ఆగస్టులో చంద్ర బాబు నాయుడు , రామారావును ముఖ్య మంత్రి పదవి న్నుంచి, తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి సెప్టెంబర్ 1 న ముఖ్య మంత్రి అవుతాడు . ఈ సన్నివేశం , వైస్ రాయ్ సన్నివేశం ఉంటాయా ? ఉండవా ? సినిమా ఎక్కడ ఆపివేస్తారు అనేది రహస్యంగా ఉంచారు . ఈ రెండవ భాగాన్ని మహా నాయకుడు పేరుతో జనవరి 24 న విడుదల చేస్తారట. ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని , ఏ సమస్యా రాక ముందే విడుదల చెయ్యాలనేది బాలయ్య ఆలోచన. . ఈ సినిమా విడుదల తరువాత తెలుగు దేశం పార్టీకి భారీగా ఓట్లు పడతాయని బాలయ్య భావిస్తున్నాడట . చంద్ర బాబు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నట్టు తెలిసింది . అందుకే రాత్రి పగలు నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నారట .