ఎన్టీఆర్ బయోపిక్ ఎంతకు అమ్మారో తెలుసా

బాలకృష్ణ సినిమాల్లో అత్యధిక రేట్లకు అమ్ముడుపోయిన సినిమాగా ఎన్టీఆర్ బయోపిక్  నిలిచిపోతుందని చెప్పవచ్చు . గతంలో బాలయ్య సినిమాలకు రెట్టింపు రేట్లు బయోపిక్ సినిమాకు వచ్చినట్టు  ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను క్రిష్ దర్శకత్వంలో “ఎన్టీఆర్ మహా నటుడు “, ఎన్టీఆర్ మహా నాయకుడు ”  రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు . మొదటి భాగం ఎన్టీఆర్ మహా నటుడు జనవరి 9 న విడుదల కాబోతున్నది . దీనికి సంబందించిన షూటింగ్ ముందు పూర్తి చేస్తున్నారు , డబ్బింగ్ కూడా చెబుతున్నారు .

ఒక మొదటి భాగంలో ఎన్టీఆర్ సినిమా జీవితం  ఎక్కువ భాగాం ఉంటుంది . అందుకే ప్రస్తుతం క్రేజ్ వున్న రకుల్ ప్రీత్, నిత్యామీనన్, మాళవిక  లాంటి హీరోయిన్లను తీసుకున్నారు . ఎన్టీఆర్ సతీమణి బసవరామ తారకంగా విద్యా బాలన్ నటిస్తుంది . అక్కినేనిగా సుమంత్ ,చంద్ర బాబుగా రానా ,.డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావుగా  భరత్ రెడ్డి  నటిస్తున్నారు .

ఈ సినిమాకు సాయి కొర్రపాటి , విష్ణు ఇందూరి తో పాటు నందమూరి బాలకృష్ణ నిర్మాతలని ప్రకటించారు . ఎప్పుడైతే దర్శకుడు తేజ నుంచి క్రిష్ కు ప్రాజెక్టు ను బాలకృష్ణ  అప్పగించాడో అప్పటి నుంచి విష్ణు  , సాయి పేరుకే నిర్మాతలు తప్ప వారికి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని బాలకృష్ణ ఇవ్వడంలేదని తెలిసింది .

ఈ సినిమా సంబందించిన ఎక్కువ భాగం హక్కులు కూడా బాలయ్యకే ఉన్నట్టు తెలిసింది . ఇక వ్యాపార పరంగా కూడా ఊహించని క్రెజ్ వచ్చిందట . ఈసినిమా ఓవర్సీస్ హక్కులను 20 కోట్లకు అమ్మినట్టు చెబుతున్నారు . ఆంధ్ర , సీడెడ్ , తెలంగాణ ,మిగతా రాష్టాల తో కలిపితే 100 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్టు ట్రేడ్ వర్గాల కథనం . ఇది కేవలం ఎన్టీఆర్ మహా నాయుడుకు మాత్రమే . రెండవ భాగం ఎన్టీఆర్ మహా నాయకుడు కు సంబంధించి ఇంకా బిజినెస్ మొదలు పెట్టలేదని దాన్ని కూడా మరో 100 కోట్లకు అమ్మేయ వచ్చునని తెలుస్తుంది .

మొత్తం మీద బాలకృష్ణ “:ఎన్టీఆర్ బయోపిక్ ” సినిమాతో కోట్లు వెనకేసుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ .