ఎన్టీఆర్ బయోపిక్ -క్రిష్ ఎం చేశాడో తెలుసా?

ఏ ముహూర్తాన ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టారో కానీ, మధ్యలో చిన్న అవాంతరాలు తప్ప షూటింగ్ హ్యాపీగా సాగుతుంది. మొదట ఈ సినిమాకు తేజను దర్శకుడుగా అనుకున్నారు . బాలయ్య కూడా ఒకే చేశాడు . వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడును ఆహ్వానించి  ముహూర్తం కూడా ఘనంగా  చేశారు . అదే సందర్భంలో దర్శకుడు రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ అంటే ట్యాంకు అంత్యంత ఇస్తామని , ఆయన జీవిత చరిత్ర సినిమాలో ఒక్క షాట్ అయినా దర్శకత్వం వహించడాని అవకాశం ఇవ్వాలని కోరాడు . అంటే ఎన్టీఆర్ బయోపిక్ తానూ చెయ్యలేక పోతున్నాననే బాధ రాఘవేంద్ర రాయాలో కనిపించింది . అయితే బాలకృష్ణ , తేజకు మధ్యలో ఏమి జరిగిందో బయటకు తెలియదు . తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు .

ఆ తరువాత రాఘవేంద్ర రావు , వై వి ఎస్  చౌదరి , కృష్ణ వంశీ , క్రిష్  పేర్లు  వినిపించాయి . అంతకు ముందు క్రిష్  దర్శకత్వంలో బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం చేశాడు . దర్శకుడుగా క్రిష్ ఏమిటో బాలకృష్ణ కు తెలుసు . అందుకే మరొక ఆలోచన లేకుండా క్రిష్ ను ఎంపిక చేసుకున్నారు .

నిజానికి క్రిష్ అప్పుడు కంగనా రనౌత్ మణికర్ణికా అనే చారిత్రాత్మక సినిమా తీస్తున్నాడు . ఇది ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవిత చరిత్ర . అత్యంత భారీ బడ్జెట్ సినిమా . ఆ సినిమా పూర్తి కాకుండానే క్రిష్  బాలయ్య మీద అభిమానాతో హైద్రాబాద్లో వాలిపోయాడు

క్రిష్ రాగానే తన టీమ్ తో యాక్షన్ లో దిగిపోయాడు . అప్పటికే ఎన్టీఆర్  బయోపిక్ చిత్ర  కథ రెడీ అయిపొయింది . మాటలు రాయడం కూడా పూర్తి అయ్యింది . క్రిష్ ఆ స్క్రిప్టును పూర్తిగా పక్కన పెట్టి  మరో స్క్రిప్టును తయారు చేసుకున్నారు . అందులో కొన్ని పాత సన్నివేశాలు కూడా వున్నాయి .

ఎప్పుడైతే తేజ బయటకు వెళ్ళాడో , అతనికి స్క్రిప్ట్ అంతా తెలుసు కనుక … అది పొరపాటున బయటకు వస్తే … అందుకే ముందు జాగ్రత్తగా క్రిష్  ఎన్టీఆర్ స్క్రిప్టును రచయితల అసోసియేషన్ లో రిజిస్టర్ చేయించారట . ఈ స్క్రిప్ట్ ఎవరైనా కాపీ కొట్టకున్నా ముందు జాగ్రత్త . ఎంతైనా క్రిష్ క్రియేటివ్ దర్శకుడే కాదు ముందు చూపు వున్నవాడు కూడా !