‘ఎన్టీఆర్’బయోపిక్ లో హన్సిక, ఆ పాటలో…

Hansika Motwani

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్టీఆర్’. నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ,నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. రెండు భాగాలుగా ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు క్రిష్. అలాగే ఈ చిత్రంలోని నటీనటుల విషయంలో క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకుని ఫైనల్ చేస్తున్నారు. ఈ సినిమాలోకి తెస్తున్న స్టార్స్ ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా ఈ సినిమాలోకి హన్సిక వచ్చి చేరిందని సమాచారం.

తమిళంలో స్టార్ హీరోయిన్ గా హన్సిక ఒక రేంజ్ లో దూసుకెళ్లిన హన్సిక తెలుగులో ఈ మధ్యన కనపడటం లేదు. అయితే ఇప్పుడు అక్కడా పెద్దగా అవకాశాలు లేవు. దాంతో ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమెకి ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

జయప్రద పాత్ర కోసం మొదట తమన్నాను అనుకున్నా .. హన్సికను టెస్ట్ చేసిన క్రిష్ .. ఆమెను ఓకే చేశాడని చెబుతున్నారు. ‘అడవి రాముడు, యుగ పురుషుడు’ లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఎన్టీఆర్‌తో జయప్రద కలిసి నటించింది. థియోటర్స్ దద్దరిల్లేలా చిందులేసింది . ముఖ్యంగా వీరి కాంబోలో ‘‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి’’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. దీంతో ఈ పాట రీమిక్స్ ని తెరపై ఎక్సపెక్ట్ చేస్తున్నారు అభిమానులు. మరి క్రిష్ ..వాటిని రిక్రియేట్ చేస్తే బాగుంటుంది.

ఇప్పటికే శ్రీదేవిగా రకుల్ .. సావిత్రిగా నిత్యామీనన్ కి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేసారు. ఇక జయసుధ పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.