‘అరవింద సమేత’ఓవర్ సీస్ లో జస్ట్ మిస్?

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అరవింద సమేత’ సినిమా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసు వద్ద డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అమెరికాలో బాగానే పే చేస్తోంది. అక్కడ ఇప్పటికే గ్రాస్ 2 మిలియన్‌ డాలర్ల మార్కును దాటి 2.17 కి చేరినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే అక్కడా ఈ సినిమా డ్రాప్ స్టార్ట్ అయ్యింది. అయితే పెట్టిన పెట్టుబడి రావాలంటే రెండున్న మిలియన్స్ రాబడి రావాలి. కానీ పరిస్దితు చూస్తూంటే బ్రేక్ ఈవెన్ తెచ్చుకుంటుందా అనేది సందేహంగా మారింది. దగ్గరలోకు వచ్చి మిస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందంటూ చిత్రం టీమ్ చెప్తోంది.

వాస్తవానికి గత కొద్ది కాలంగా…ఓవర్ సీస్ లో హిందీ సినిమాల కలెక్షన్స్ ను తెలుగు చిత్రాలు దాటేస్తున్నాయి. 2018లో విడుదలైన ‘రంగస్థలం’ (మార్చి), ‘భరత్‌ అనే నేను’ (ఏప్రిల్‌), ‘అరవింద సమేత’ (అక్టోబరు) ఆస్ట్రేలియాలో అదిరిపోయే వసూళ్లు రాబట్టాయి. ఆస్ట్రేలియాలో విడుదలౌతున్న మిగిలిన భారతదేశ భాషా చిత్రాల కంటే తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో అరవింద సమేత పై కూడా అందరూ అక్కడ మార్కెట్ ని ఊపుతుందని ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆ ఊపు చల్లబడిపోయింది.

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అరవింద సమేత’. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్. జగపతిబాబు, ఈషా రెబ్బా, సునీల్‌, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ఇందులో ఎన్టీఆర్‌ ‘వీరరాఘవ’ పాత్రలో, పూజా హెగ్డే ‘అరవింద’ పాత్రలో కనిపించారు. అక్టోబరు 11న విడుదలైన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ అందుకుంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకులతోపాటు ప్రముఖుల ప్రశంసలు లభించాయి.