క్రేజీ అప్డేట్ : ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో ఆ సినిమా రీ రిలీజ్ అట..!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మన స్టార్ హీరోల సినిమాలు పాతవి మళ్ళీ వాటిని ఇప్పుడు ఉన్న టెక్నాలజీ మిక్స్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా తన ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ “పోకిరి” రిలీజ్ చెయ్యగా..

దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిట్ సినిమా “జల్సా” చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తుండగా ఈ సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా చేస్తున్నారు.

ఇక నెక్స్ట్ నెల అక్టోబర్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే వస్తుండగా ఇప్పుడు డార్లింగ్స్ ప్రభాస్ కెరీర్ లో ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అయినటువంటి “బిల్లా” చిత్రాన్ని 4కే లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు సినీ వర్గాల్లో క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.

అనుష్క మరియు నమితలు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ సూపర్ గా తెరకెక్కించాడు. దీనితో ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఈ సినిమాని అయితే ఇప్పుడు రీ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్స్ మొదలయ్యాయి. మరి ఈ సినిమాకి హంగామా ఎలా ఉంటుందో చూడాలి.