వైరల్ : 10 కోట్లు వదిలేసిన అల్లు అర్జున్..ప్రముఖ ఐఏఎస్ ప్రశంసలు..!

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న మన తెలుగు స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ సెట్ చేసుకున్న సామ్రాజ్యం మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. రాజమౌళితో సినిమా లేకుండా హిందీలో భారీ క్రేజ్ ని తన సినిమాకి భారీ వసూళ్ళని నమోదు చేసుకున్న హీరోగా బన్నీ నిలిచాడు.

అయితే ఈ క్రేజ్ తర్వాత బన్నీ కి మరిన్ని భారీ స్థాయి ఆఫర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మరి లేటెస్ట్ గా అయితే ఒక్కో యాడ్ కి గాను రికార్డు మొత్తం 7 కోట్లు పారితోషకం తీసుకున్న ఏకైక స్టార్ గా రికార్డు సెట్ చేయగా ఓ భారీ ఆఫర్ ని కూడా తృణ ప్రాయంగా వదిలేసుకోవడంతో కూడా చాలా ప్రశంసలు కూడా బన్నీ పై వచ్చాయి.

అయితే ఓ ప్రముఖ మాదక ద్రవ్యాల సంస్థ అల్లు అర్జున్ కి 10 కోట్లు ఇస్తానన్నా ఆ భారీ ఆఫర్ ని తాను రిజెక్ట్ చేసాడని తెలియడంతో ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా ఈ అంశంపై ఛత్తీస్ ఘర్ కి చెందిన ప్రముఖ ఐ ఎస్ ఎస్ అవనీష్ శరన్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.

గుట్కా, లిక్కర్ యాడ్స్ చేయమని వచ్చిన 10 కోట్ల ఆఫర్ ని ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వదిలేసుకోవడం గొప్ప విషయం అని ఇందులో తనని అభినందిస్తున్నానని తాను ట్వీట్ చేసారు. దీనితో ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో మరియు అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇక అలాగే మరికొన్ని వారాల్లో అల్లు అర్జున్ అయితే పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.