ఇప్పుడు సోషల్ మీడియా సినిమా లవర్స్ మధ్య జరుగుతున్న చర్చ ఏమిటి అంటే విజయ్ దేవరకొండ …కొండలాంటి దిల్ రాజు ప్లాన్ లను కూలగొట్టి తన జెండా పాతుతున్నాడు అని. అదెలా అంటే …దిల్ రాజు తను ఎంతో ఇష్టపడి ప్రొడ్యూస్ చేసిన సినిమా శ్రీనివాస కళ్యాణం. తన కాన్సెప్ట్ ని కథ గా రెడీ చేయించి, పట్టాలు ఎక్కించి నితిన్ కు ఓ బ్లాక్ బస్టర్ ఇస్తానని అన్నారు. అయితే శ్రీనివాస కళ్యాణం …భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
అయితే అదే సమయంలో వచ్చిన గీతా గోవిదం సినిమా ఇంకా ఆడుతూనే ఉంది. అది మెగా హిట్ అయ్యింది. వ్యాపారపరంగా దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రత్యర్దులు. దాంతో తమ సినిమా పోవటం ఒకెత్తు…తమపై పోటీకి వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవటంతో మరో ఎత్తు. సరే …జయాపజయాలు మన చేతిలో ఉండవు అని సరిపెట్టుకుందాము అంటే మరోసారి విజయ్ దేవరకొండ తన సినిమాని దిల్ రాజు సినిమాపై వదులుతున్నాడు.
విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం నోటా. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చేసింది. అదే సమయంలో దిల్ రాజు తన హలో గురు ప్రేమ కోసమే రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలూ అక్టోబర్ 18నే విడుదల అవుతున్నాయి. దశరా ఫెస్టివల్ ని క్యాష్ చేసుకోవాటనికి ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి.
రామ్ హీరోగా వస్తున్న హలో గురూ ప్రేమ కోసమే సినిమాపైనా మంచి అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే విజయ్ దేవరకొండ నోటా ని తక్కువ అంచనా వేయలేం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు అభిమానులు యూత్ లో పెరిగిపోయారు. గీతా గోవిందంతో ఫ్యామిలీలకు నచ్చే హీరో అయ్యిపోయాడు. దాంతో ఇప్పుడు ట్రేడ్ లో ఇదే హాట్ టాపిక్
గా మారింది.