మహేష్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాదు..నిర్మాత నుంచే క్లారిటీ.!

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు ఒకదాన్ని మించి ఇంకో సినిమా ఉన్న సంగతి తెలిసిందే. మొదటగా అయితే మహేష్ తన కెరీర్ లో 28వ సినిమాగా దర్శకుడు త్రివిక్రమ్ తో భారీ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాని ఏకంగా 200 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండగా అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం పై అయితే చాలా రూమర్స్ పై టాలీవుడ్ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంపై ఆల్రెడీ బిజినెస్ జరుగుతుంది అనే మాట అవాస్తవం అని, మేమెప్పుడూ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక బిజినెస్ కోసం ఆలోచిస్తామని అలాగే ఈ సినిమాకి ఇంకా అలాంటివి స్టార్ట్ చెయ్యలేదని చెప్పాడు.

అలాగే నాన్ థియేట్రికల్ బిజినెస్ లో కూడా వస్తున్న వార్తలు అవాస్తవమే అని అంత మొత్తంలో అఫర్ రావడానికి ఇదేమి పాన్ ఇండియా సినిమా కాదని బిగ్ క్లారిటీ ఇచ్చాడు. దీనితో సినిమాకి అంత బిజినెస్ లేదని అలాగే పాన్ ఇండియా రిలీజ్ కూడా ఉండదు అని అయితే కన్ఫర్మ్ చేసేసాడు.

ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మహేష్ బాబు అయితే ఇప్పుడు తన ఇంట జరిగిన విషాదం నుంచి తేరుకొని షూటింగ్ లో పాల్గొనడానికి కొంత సమయం పడుతుంది.