నిరాశలో నిత్యా మీనన్!
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరచుకున్న నటి నిత్యామీనన్. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన ఆడి పాడిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తీవ్ర నిరాశలో కొట్టు మిట్టాడుతుందట.
అందుకు కారణం లేక పోలేదు.. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలేవీ అంతగా తన మనసును దోచుకోలేదట. తన కెరీర్ లో ఎదో ఒకటీ, రెండూ తప్ప పెద్దగా చెప్పుకునేవీ ఏవీ లేవట. ఆయా చిత్రాల్లోని పాత్రలు సైతం ఆమెను కదిలించ లేక పోయాయట. ఆచ్చర్య పోతున్నారు కదా! మరి అదే తొందరంటే..
ఈ విషయాలన్నీ తనే స్వయంగా చెప్పుకొచ్చిందట ఇటీవల తన ఫ్రెండ్స్ వద్ద. కోరుకున్న పాత్రలేవీ లభించక పోవడం వల్ల ఒక దశలో సినిమాలకే గుడ్ బై చెప్పేయాలనుకుందట. కథానాయికలను ఆడియన్స్ చూసే కోణం వేరు. మమ్మల్ని మేము చూసుకునే కోణం వేరు. అందరికీ నేను నిత్యను కావొచ్చు.. కానీ నాకు కాదు అని చెప్పుకొచ్చింది గడుసుపిల్ల నిత్యామీనన్.
నటిగా నా మీద ఆడియన్స్ కు కొన్ని అంచనాలు, అభిప్రాయాలు ఉండొచ్చు. అవన్నీ బయటనుంచి చూస్తూ ఏర్పరచుకున్నవి. నా వరకు నేను నటి నిత్యను కాను. నేను నాలాగానే ఉండాలనుకుంటాను. ఇవన్నీ చెప్పుకొచ్చిన నిత్యకు ఇంతకు నిరాశా ఎందుకు దరి చేరిందో మాత్రం సూటిగా చెప్పనే లేదు. ప్చ్.. నిత్యా!!