ఎన్టీఆర్ జీవితంలో మరుపురాని చిత్రాల్లో ఒకటి గుండమ్మ కథ. ముఖ్యంగా ఆయన పప్పు రుబ్బుతూ.. ఉండే సీన్ అయితే ఎవరూ మర్చిపోలేరు. లేచింది‘లేచింది నిద్రలేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అంటూ పాట ఎత్తుకునే తీరు ఇప్పటికి చప్పట్లు కొట్టిస్తూంటుంది. అలాంటి అధ్బుతమైన సన్నివేశం..ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా చేస్తున్నప్పుడు ఉండాల్సిందే కదా. దర్శకుడు క్రిష్ కూడా అదే ఆలోచించినట్లున్నారు.
గుండమ్మకథలోని పాత్రల్లో బుల్లోడుగా బాలయ్య కనిపిస్తుండగా.. బుల్లెమ్మగా నిత్యామీనన్ రెడీ చేసి తెరకెక్కించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బాలయ్య పిండి రుబ్బుతూ నవ్వుతూ కనిపించగా.. సావిత్రి పాత్రలోని నిత్యామేనన్ కనిపించారు. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం వివరాల్లోకి వెళితే..
నందమూరి తారక రామారావు బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో కనిపించనున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ఒక్కో పాత్రను చిత్ర యూనిట్ అభిమానులకు పరిచయం చేస్తూ పోస్టర్లు విడుదల చేస్తోంది.
ఎన్‌బీకే ఫిల్మ్స్, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. యన్‌టిఆర్‌ను రెండు భాగాలుగా విడుదలకి ప్లాన్ చేసారు. జనవరి 9న ‘కథానాయకుడు’, జనవరి 24న ‘మహానాయకుడు’గా విడుదల చేస్తారు.