నట్టికుమార్ ఎఫెక్ట్…నిఖిల్ టైటిల్ మార్చేసాడు

నిఖిల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ విషయంలో గత కొద్ది రోజులుగా వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అసలు ‘ముద్ర’ టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ,నిర్మాత నట్టికుమార్ ఇదే టైటిల్‌తో పోస్టర్‌ను డిజైన్‌ చేసుకుని సినిమాను విడుదల చేశారు. దాంతో ఈ విషయం కాస్తా వివాదాస్పమైంది. ఒకరిపై మరొకరు ఛాలెంజ్ లు విసురుకున్నారు.

చివరకి ఏమైందో ఏమో కానీ నిఖిల్ దిగి వచ్చి టైటిల్ మార్చుకున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ‘అర్జున్‌ సురవరం’గా మారుస్తూ కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఆ పోస్టర్ మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక లో నిఖిల్‌ అర్జున్‌ లెనిన్‌ సురవరం అనే జర్నలిస్ట్‌ పాత్రలో నటించారు. వ్యాను నుంచి నిఖిల్‌ కెమెరాతో ఓ దృశ్యాన్ని షూట్ చేస్తూ ఫస్ట్‌లుక్‌లో కన్పించారు. ఇందులో నిఖిల్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ను జోడించే నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేసామని చెప్తున్నారు. ఔరా సినిమాస్‌, మూవీ డైనమిక్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఠాగూర్‌’ మధు సమర్పిస్తున్నారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.