పేరు తెలుసుకుని ఏం చేస్తాం?

మెగా డాటర్‌ నిహారికకు టైమ్‌ వచ్చినట్లే ఉంది. బుల్లితెర మీద రాణించిన నిహారిక.. వెండితెరపై ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒక మనసు, హ్యాపి వెడ్డింగ్‌ చిత్రాలతో మన ముందుకు వచ్చినా .. ఆశించినంత సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. దాంతో ఈ సారి ‘సూర్యకాంతం’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది.

Suryakantam Teaser - Niharika, Rahul Vijay | Pranith Bramandapally | Nirvana Cinemas

సక్సెస్‌ఫుల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ముద్దపప్పు ఆవకాయ’ డైరెక్టర్‌ ప్రణీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా మెగా హీరో, నిహారిక సోదరుడు వరుణ్‌ తేజ్‌ సూర్యకాంతం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

ఫైట్‌ మాస్టర్‌ విజయ్ తనయుడు రాహుల్‌విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న సూర్యకాంతం చిత్రంలో నిహారికి విభిన్న పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని మార్చిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.