సెలబ్రెటీల పెళ్లి వేడుక అనగానే మొదట అందరి దృష్టి కూడా వారి ఖర్చులు ఎలా ఉంటాయనే విషయంపైనే ఉంటుంది. ఇక నిహారిక పెళ్లిపై కూడా ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తరువాత మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరి సందడిగా నిర్వహించిన ఈ వేడుక ఖర్చు దాదాపు చిన్న సినిమాకు పెట్టిన బడ్జెట్ తో సమానమట.
మూడు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అంత సాధారణమైన విషయం కాదు. అడుగడుగునా బిల్లుల మొత మొగుతుంది. అతిధి ట్రావెలింగ్ ఖర్చుల నుంచి వెళ్లే వరకు అన్ని పైసాతో కూడుకున్న పని. మొత్తం వేడుకలో 150 మందికిపైగా పాల్గొన్నారు. ఇక నిహారిక ఒక్కగానొక్క కూతురు కావడంతో నాగబాబు ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఆమె వేసుకున్న బంగారం ఖరిదే మూడు కోట్ల విలువ ఉంటుందట. ఇక మెగాస్టార్ కూడా మరో రెండు కోట్ల వరకు కానుకలు ఇచ్చారు.
పెళ్లి ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక అక్కడ వెడ్డింగ్ కోసం అలాగే అతిధుల విడిది, సౌకర్యాలు అలా అన్ని కలుపుకొని మరో మూడున్నర కోట్ల వరకు అయ్యి ఉంటుందట. ఇక కట్నకానుకలు ఏ రేంజ్ లో ఇచ్చారో తెలియదు గాని ఈ విధంగా చూసుకుంటే నీహారిక పెళ్లి కోసమే 10కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం. అంటే ఆ బడ్జెట్ ఒక మంచి మినీ సినిమాకు సమానం అన్నమాట..