పెళ్లి కూతురిగా మారిన నిహారిక.. నాగబాబు ఎమోషనల్

Niharika Konidela In Bapu Bommaki Pellanta

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ఓ ఇంటిది కాబోతోంది. నిహారిక పెళ్లిపై వచ్చిన వార్తలు, రూమర్లు మరేతర స్టార్ హీరోయిన్‌పైనా వచ్చి ఉండవు. మెగా డాటర్ కావడంతో నిహారికపైనే అందరి దృష్టి ఉండేది. ఇక నిహారిక పెళ్లి అంటూ మీడియా ఎన్నోకథనాలు కూడా వడ్డించింది. ఏకంగా ప్రభాస్‌తో నిహారిక పెళ్లి అంటూ రూమర్లు పుట్టించింది. అయితే ఇలాంటివాటన్నంటికి మెగా ఫ్యామిలీ పుల్ స్టాప్ పెట్టేసింది.

Niharika Konidela In Bapu Bommaki Pellanta
Niharika Konidela In Bapu Bommaki Pellanta

గుంటూరు ఐజీ కొడుకు, టెక్కీ అయిన చైతన్యతో నిహారిక పెళ్లిని ఫిక్స్ చేశారు. ఇక వీరిద్దరి జంటకు సోషల్ మీడియాలో ఫుల్ మార్కులు కూడా పడ్డాయి. హీరోలా ఉండటంతో.. మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ రాబోతోన్నాడని అప్పుడే టాక్ మొదలైంది. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత నెలలో తనకు కాబోయే భర్త పుట్టిన రోజు సంద్భరంగా రిలీజ్ చేసిన ఫోటోలు ఎంతగానే హల్చల్ చేశాయి.

Nagbabu emotional
Nagbabu emotional

మూడు ముళ్లే పడలేదు కానీ ఇప్పుడు కాబోయే భర్తపై ఎంతో ప్రేమను పెంచుకుందని ఆ ఫోటోలను, ఆ కామెంట్లను పట్టి తెలుస్తోంది. అయితే తాజాగా నిహారిక పెళ్లి కూతురుగా మారింది. అది చూసి నాగబాబు తెగ మురిసిపోయాడు. అయితే ఇదంతా రియాల్టీ కాదు. వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ కోసం. కానీ ఎమోషన్స్ మాత్రం నిజంగా పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. పెళ్లి కూతురుగా నిహారిక పల్లకిలో రావడం, ఆ అందమైన దృశ్యాలను నాగబాబు ఫోన్‌లో బంధించడం, చివర్లో నాగబాబు ఒళ్లో వచ్చి కూర్చోవడం అందర్నీ ఎమోషన‌ల్‌గా టచ్ చేసింది.