సెలబ్రెటీల పెళ్లి వేడుకలకు ఖర్చులు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎక్కువగా ఖరీదైన డ్రెస్సులతోనే వార్తల్లో నిలుస్తుంటారు. ఇక నిహారిక పెళ్లి డిసెంబర్ 9న 7గంటల 15నిమిషాలకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో జరగనున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల ముందు నుంచే వివాహానికి సంబంధించిన పనులు మొదలుపెట్టిన మెగా ఫ్యామిలీ రోజుకో ఫొటోతో ఆడియేన్స్ కి మంచి కిక్కిస్తోంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే నిహారిక పెళ్లి చీర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఎందుకంటే ఆ చీర ఇప్పటిది కాదు. 32ఏళ్ళ చరిత్ర కలిగింది. ఎన్ని కోట్లు పెట్టినా కూడా అంత సెంటిమెంట్ చీర దొరకదేమో. ఎందుకంటే ఆ పెళ్లి చీర నిహారిక తల్లి పద్మజది. 1988 ఆగస్ట్ 26న నాగబాబు – పద్మజ వివాహం జరిగింది. పద్మజ అప్పుడు ఇదే చీరలో పెళ్లి కూతురుగా పెళ్లి పీఠలపై కూర్చుంది. వరుణ్ తేజ్ – నిహారిక లకు జన్మనిచ్చిన ఈ దంపతులు నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను కలిసి ఎదుర్కొన్నారు. ఇక 32 ఏళ్ల తరువాత నిహారిక తన తల్లి పెళ్లి చీరను ధరించి పెళ్లి పీఠలు ఎక్కనుంది.
ఇక నిహారిక మెడలో మూడు ముళ్ళు వేయనున్న చైతన్య జొన్నలగడ్డ ఎలాంటి డ్రెస్సులో కనిపిస్తాడో చూడాలి. ఆగస్ట్ 13న ఒక హోటల్ లో అతి తక్కువమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లికి వంద మంది కంటే ఎక్కువ అతిథులను ఆహ్వానించలేదని తెలుస్తోంది. మెహ హీరోలందరు హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఎంగేజ్మెంట్ కు హాజరు కాలేదు. ఇక పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తారని తెలుస్తోంది.