దీనికీ ఓ స్కెచ్ ఉంది:మెగా హీరో సరసన ‘సవ్యసాచి’ హీరోయిన్!

రీసెంట్ గా రిలీజైన నాగచైతన్య చిత్రం ‘సవ్యసాచి’ టాక్ తేడా వచ్చి ఉండచ్చు. నాగచైతన్య కెరీర్ కు మైనస్ అయ్యిండవచ్చు. కానీ అందులో లో హీరోయిన్ గా చేసిన నిథి అగర్వాల్ కు మాత్రం ఆ సినిమా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు ఆమెలోని అందాలను బాగానే తెరపై పరిచి,కనువిందు చేసాడు. అలాగే నటిగా కూడా ఆమె కొత్త అనిపించుకోకుండా చక్కగా చేసింది.

ఇవన్నీ ఆమె కు ప్లస్ అయ్యాయి. చైతూ సినిమా కావటంతో ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నా ఓ సారి అయినా ఇండస్ట్రీ వాళ్లు చూస్తారు. ఈ క్రమంలో ఆమెకు తెలుగు ఇండస్ట్రీ నుంచి వరస ఆఫర్స్ వర్షం మొదలైందని సమాచారం. తన దగ్గరకు వచ్చిన ఆఫర్స్ లో సరైనది ఎంచుకోవటం ఆమె వంతు. అలా నిథి అగర్వాల్ ..మెగా హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరూ అంటే వైష్ణవ్ తేజ్.

రీసెంట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపిక అయ్యింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ కానుంది.

ఇక ఆమెనే ఎంపిక చేయటం వెనక కారణం

నిధి అగర్వాల్ ఇఫ్పటికే అఖిల్ నటిస్తోన్న మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్ సినిమా రిలీజ్ కు ముందు సినిమా ప్రమోషన్ లో భాగంగా నిధి అగర్వాల్ ను ఓ రేంజిలో ఎలాగో ప్రమోట్ చేస్తారు. సినిమా హిట్టైతే ఆమె సెన్లేషన్ కూడా అవుతుంది. అవన్నీ వైష్ణవ్ తేజ్ సినిమాకు, బిజినెస్ పరంగా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా తెరకెక్కనుందని సమాచారం. సవ్యసాచి చిత్రం కూడా మైత్రీమూవీస్ బ్యానర్ పైనే నిర్మించారు. దాంతో సహజంగానే ఆ బ్యానర్ తో హీరోయిన్ కు అనుబంధం ఏర్పడుతుంది కాబట్టి …రెమ్యునేషన్ పరంగా కూడా ప్యాకేజ్ లో లాగించేయచ్చు. ఇవన్నీ ఆలోచించే నిధి అగర్వాల్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నట్లు సమాచారం.