కమెడియన్లు హీరోలు అవుతున్న వేళ
కింగ్ నాగార్జున అభిమాని ప్రేమ కథ ఇదీ అంటూ కలరింగ్… శివ రేంజులో చైన్ లాగుతూ.. నాగార్జున లెవల్లో పంచ్ లు వేస్తూ చాలానే చేశాడు. కానీ ఏం లాభం? రంగస్థలం మహేష్ ని హీరోని చేస్తూ జీఎన్.ఆర్. క్రియేషన్స్ చేస్తున్న ప్రయత్నం నేను నా నాగార్జున
. పొట్లకాయలా పొడుగ్గా.. చీపురు పుల్లలా సన్నగా ఉండేవాడి ప్రేమకథా చిత్రమిది. అందులోనే అక్కినేని ఫ్యానిజం. అయితే నాగార్జున ఫ్యాన్ ప్రేమకథ ఎంతవరకూ వర్కవుటవుతుంది? అన్నది డౌట్ పుట్టించింది. కమెడియన్లు హీరోలు అవుతున్న ఈ సీజన్ లో మహేష్ పప్పులు ఉడుకుతాయా? అంటే ఇదిగో ఈ ట్రైలర్ చూస్తే కచ్ఛితంగా పనవ్వదని ఎవరైనా చెప్పేయొచ్చు. ట్రైలర్ కటింగ్ తోనే సినిమాలో పస లేదని తేలిపోయింది.
ట్రైలర్ అంటే ఇలాగా ?
నాశిరకం విజువల్స్.. పరమ బోరింగ్ ట్రీట్ మెంట్ తో సినిమా తీశామని ప్రీ విజువల్స్ లోనే చూపించేసి తెలివితక్కువతనాన్ని అలా ప్రదర్శించారంటే తప్పేమీ కాదు. సినిమా ఎలా తీశారు? అన్నది అటుంచితే అసలు ట్రైలర్ కటింగ్ అనేది ఎంత ముఖ్యమో కనీస మాత్రంగా అయినా దర్శకనిర్మాతలు గ్రహించలేదా? అన్న సందేహం ఈ ట్రైలర్ ని చూశాక కలుగుతుంది. ట్రైలర్ లో డైలాగులు అంతే నాశిరకంగా తేలిపోయాయి. ప్రొడక్షన్ విలువలు అని ప్రత్యేకంగా ఒక పదం ఇందుకే పుట్టింది. అది ఈ సినిమాకి సెట్టవ్వలేదని ఈ ట్రైలర్ క్లియర్ కట్ గా చెప్పింది. అన్నట్టు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరై ఉంటారో కనిపెట్టండి చూద్దాం.