ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ శనివారం రోజు తన మామ నందమూరి బాలకృష్ణతో సమావేశమయ్యారు. బాలకృష్ణ ప్రస్తుతము ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ లో వున్నారు. ఈ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ప్రకటించిన తరువాత మరికొన్ని సన్నివేశాలను కలుపుతున్నట్టు తెలిసింది. వచ్చే సంవత్సరం జనవరి 9 న తొలి భాగం, 24 న రెండవ భాగం విడుదల చేస్తామని బాలకృష్ణ ప్రకటించాడు.
అందు చేత రాత్రి పగలు ఈ చిత్ర మీదనే బాలకృష్ణ పనిచేస్తున్నారు తెలిసింది. ఇదిలా ఉంటే హఠాత్తుగా నారా లోకేష్ బాలకృష్ణ ను ఎందుకు కలిసినట్టు? 19వ తేదీన రామ్ గోపాల్ వర్మ తన “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమాను ప్రకటించాడు. తిరుపతిలో ఈ సినిమా అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఈ ప్రారంభోత్సవంలో లక్ష్మి పార్వతి కూడా పాల్గొన్నది. ఆమె చంద్ర బాబు పట్ల చాలా పరుషంగా మాట్లాడింది. వర్మ కూడా అన్నీ నిజాలని చూపిస్తానని చెప్పాడు. ఇది తెలుగు దేశంలో ముఖ్యంగా నారా కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తున్నట్టు తెలిసింది.
వర్మ సినిమా తన సినిమాను జనవరి 24న విడుదల చేస్తామని ప్రకటించినా నిజానికి 9 నే విడుదల చెయ్యవచ్చునని ఫిలిం ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముందుగానే 9 అని ప్రకటిస్తే థియేటర్లు లభించక పోయే ప్రమాదం వుంది. అందుకే వర్మ , రాకేష్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారని అనుకుంటున్నారు.
వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా చంద్ర బాబు వ్యక్తిత్వం మీద ప్రభావం చూపించే అవకాశం వుంది. మామ తారక రామారావును వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని ఈ సినిమాలో చూపించే అవకాశం వుంది . అంతే కాదు రామారావు చివరి వీడియో కూడా చిత్రంలో చూపిస్తారని అంటున్నారు.
అందుకే కలవర పడ్డ చంద్ర బాబు లోకేష్ ను బాలకృష్ణ దగ్గరకు శనివారం నాడు పంపించినట్టు తెలిసింది. ఇదే విషయం లోకేష్ బాలకృష్ణతో చర్చించినట్టు తెలిసింది. జరగబోయే డామేజ్ ను ఎలా కాపాడుకోవాలి? ఏరకమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి ? అన్న విషయాలు చర్చించినట్టు తెలిసింది ఇదే సందర్భంలో తెలంగాణాలో ఎన్నిక గురించి కూడా వీరి మధ్య ప్రస్తావన కొచ్చినట్టు చెబుతున్నారు.
రామ గోపాల్ వర్మ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో దిట్ట. మీడియాను ఉపయోగించుకోవడంలో వర్మను మించినవారు లేరు.
వర్మను బాలకృష్ణ , చంద్ర బాబు ఎలా ఎదుర్కొంటారు ?