లాభాల్లో నాని..‘జెర్సీ’… ప్రి రిలీజ్ కేక

న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘జెర్సీ’రిలీజ్ కు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయినట్టే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కూడా పూర్తైంది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓ రేంజిలో ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. దాదాపు 31 కోట్లు దాకా ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. నాని సినిమాలతో చూస్తే ఇది చాలా పెద్ద మొత్తం.

భీమిలి కబడ్డీ జట్టు తర్వాత నాని చేస్తున్న ఫుల్ లెన్త్ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇందులో ఆయన అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘36 ఏళ్ల వయసులో క్రికెట్‌ రంగంలో నిరూపించుకోవడానికి అతని వద్ద ఏమీ లేదు. కలల్ని, ఆశయాల్ని వదులుకోవాల్సి వచ్చింది. 1996-97లో రంజీ ట్రోఫీ సీజన్‌లో అతను ఆడినప్పుడు బ్యాటింగ్‌ పట్ల అతనికున్న ఆసక్తి బయటపడింది’అనే స్టోరీ లైన్ తో సినిమా చేసారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు నాని విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ‘దేవదాస్’ తర్వాత నాని నటిస్తున్న చిత్రమిది.